అమ్మ : ఈ లక్షణాలు ఉంటే తల్లి కాబోతున్నారని అర్ధం.. !!

Suma Kallamadi
ఒక స్త్రీ తన జీవితంలో ఆనంద పడే క్షణం ఏదన్నా ఉంది అంటే అది తల్లి అయినపుడు మాత్రమే.అయితే ప్రతి మహిళకు తాను గర్భవతి అని తెలియడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి.అంటే  స్త్రీ యొక్క శరీరంలో జరిగే మార్పులను బట్టి గర్భవతా..?  కదా..? అన్న విషయం తెలిసిపోతుంది. అయితే ఆ స్త్రీ గర్భవతి అని తెలియడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అవేంటో చూద్దాం.. ! మొదటి సంకేతం ఋతుక్రమం అనేది సమయానికి రాకపోవడం.అంటే మొదటి నెల నెలసరి రాకపోతే ఆ స్త్రీ గర్భవతి అని.



అయితే ఈ నెలసరి సంకేతాలు ప్రతి స్త్రీకి భిన్నంగా ఉంటాయి.కొంతమందికి కొన్ని హార్మోన్ల సమస్యల వల్ల కూడా నెలసరి సమయానికి రాదు అలా అని వారు కడుపుతో ఉన్నారని అనుకుంటే పొరపాటే. నెలసరి రాకపోవడంతో పాటు ఈ క్రింది లక్షణాలు కూడా ఆ స్త్రీలో ఉంటేనే గర్భవతి అని అర్ధం. అవేంటో చూద్దాం..అలాగే గర్భధారణ సమయంలో స్త్రీ యొక్క రొమ్ములు సున్నితత్వంగా ఉంటాయి. ఈ సమయంలో హార్మోన్ స్థాయిలు పెరగడం వలన అవి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి.అలాగే  రొమ్ము కణజాలంలో కూడా మార్పులకు దారితీస్తాయి.అంటే రొమ్ముల పరిణామం మాములు సమయంలో కన్నా గర్భవతిగా ఉన్నపుడు కొంచెం పెద్దవిగా అవుతాయి. ఇవి స్పర్శకు సున్నితంగా, కొంచెం నొప్పిగా మరియు ఇబ్బందిగా ఉంటాయి. గర్భధారణ సమయంలో స్త్రీ యొక్క మానసిక స్థితిలో అనూహ్యమైన మార్పులు వస్తాయి.ఒక్కోసారి తన  భావోద్వేగాలను నియంత్రించుకోలేకవచ్చు.వీటినే మూడ్ స్వింగ్స్ అని కూడా అంటారు.




హార్మోన్ల స్థాయిలలో గణనీయమైన మార్పులు కలగడం వలన ఇలా అవుతుంది. ప్రెగ్నన్సీ యొక్క మొదటి వారంలో అధికమైన మందపాటి లేదా తెల్లని యోని స్రావాన్ని (తెల్లబట్ట) అనుభవించవచ్చు. సాధారణంగా ఋతుస్రావం దాటిపోయిన సమయంలో ఇది ఏర్పడుతుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల జరుగుతుంది.గర్భధారణ ప్రారంభంలో అలసటగా అనిపించవచ్చు.ఇది తల్లి కాబోతున్నవారిలో సాధారణం. ఇది హార్మోన్ల మార్పుల వల్ల కావచ్చు. సాధారణంగా 12 వారాల గర్భవతి అయ్యే వరకు ఇలా ఉంటుంది.అలాగే కొంతమంది మహిళల్లో ఉదయపు పూట వాంతులు, వికారం, మైకము, తలనొప్పి మరియు గందరగోళం వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా  మొదటి 4 వారాలలో ఉండవచ్చు,  ఉండకపోవచ్చు. సాధారణంగా రెండవ త్రైమాసికానికి చేరుకునే సమయానికి తగ్గిపోతుంది.పై లక్షణాలు పరిగణలోకి తీసుకుని గర్భధారణ నిర్ధారణ చేసుకునే ముందు వైదుడిని కూడా సంప్రదిస్తే మంచిది... !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: