అమ్మ : గర్బాధారణ సమయంలో రొమ్ములలో దురద రావడానికి కారణాలు ఇవే.. !!
గర్భధారణ సమయంలో మీ శరీరంలోని మార్పులతో పాటు మీ ఆరోగ్యంలో మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. గర్భం దాల్చిన స్ట్రీలో మొదటగా వచ్చే మార్పు రొమ్ములలో దురద. ఇది కొద్దికాలం మాత్రమే కొనసాగుతుంది. రొమ్ములలో వచ్చే మార్పులకు చాలా శ్రద్ధ అవసరం. రొమ్ము, నిప్పల్స్ లో దురదకు కారణాలు మరియు దాని నివారణలను పరిశీలిద్దాం.గర్భం నిర్ధారించబడటానికి ముందు శరీరం కొన్ని సంకేతాలను చూపుతోంది. చనుమొన లేదా రొమ్ములకు చికాకు కలిగిస్తుంటాయి. ఎందుకంటే గర్భధారణ తర్వాత ఒకటి నుండి రెండు వారాల వరకు రొమ్ము మార్పులు ప్రారంభమవుతాయి..
గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పు వలన రొమ్ములలో దురద వస్తుంది. గర్భధారణ సమయంలో చర్మంలో చాలా మార్పులు వస్తాయి. ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం, అలాగే గర్భధారణను ప్రభావితం చేసే ఇతర హార్మోన్లు వల్ల శరీరంలో ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. చనుమొనలు మరియు చుట్టుపక్కల చర్మం నల్లబడటంతో మీకు దురద వస్తుంది.చర్మం పొడిగా మారడం తరచుగా మీ శిశువు పెరుగుదలను బట్టి సహజంగా సంభవించే మార్పు. బిడ్డ పెరిగేకొద్దీ చర్మం పెద్దదై రొమ్ములు పొడిగా, చిరాకుగా మారుతాయి. దీన్ని స్కిన్ స్ట్రెయిన్ లేదా పొడి చర్మం అని కూడా అంటారు. దురద విషయంలో ఇది తరచుగా జరుగుతుంది.బాగా దురదగా అనిపిస్తే మాయిశ్చరైజింగ్ రాసుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది. కోకో బటర్, విటమిన్ ఇ ఆయిల్, కలబంద, లానోలిన్ లేదా పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకోవడం వల్ల దురద నుండి ఉపశమనం పొందవచ్చు. పెర్ఫ్యూమ్స్ లేదా ఆల్కహాల్ లోషన్లను వాడకండి ఎందుకంటే అవి చర్మం ఆరిపోయేలా చేస్తాయి .
సరైన బట్టలు ఎంచుకోవడానికి జాగ్రత్త తీసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించడానికి జాగ్రత్తగా ఉండండి. ఈ సమస్యలను కొంతవరకు పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది. ప్రసూతి బ్రా ఎంచుకోవడం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. గర్భధారణ సమయంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు.ఇది చర్మం పొడిబారడానికి మరియు చర్మం దురదకు కారణమవుతుంది.అలాగే స్నానం చేసేటప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే నీరు పుష్కలంగా త్రాగాలి. ఇది మీ చర్మానికి చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. పుష్కలంగా నీరు త్రాగటం వల్ల చర్మ నిర్జలీకరణాన్ని తొలగించి దురద నుండి ఉపశమనం పొందవచ్చు.