అమ్మ : గర్భధారణ సమయంలో సంభోగం చేయవచ్చా..?? చేస్తే ఏమవుతుందో తెలుసుకోండి.. !!
అయితే గర్భందాల్చి ఉన్నప్పుడు కూడా సెక్స్‌ను ఆస్వాదించొచ్చని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఏడో నెల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని భంగిమల్లోనూ సెక్స్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే స్త్రీ, కడుపులో బిడ్డ ఆరోగ్య దృష్ట్యా ఏడో నెల దాటిన తర్వాత సెక్స్‌లో పాల్గొనకపోవడమే మంచిదని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనటం వల్ల వారిలో నూతన ఉత్సాహం కలుగుతుంది. ఆ సమయంలో సెక్స్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.సెక్స్ లో పాల్గొంటే మంచి నిద్రపడుతుంది. మానసిక రుగ్మతను దూరం చేస్తుంది. మనసును తేలిక చేస్తుంది.
కాబట్టి గర్భిణీ స్త్రీలు సెక్స్‌లో పాల్గొంటే ఈ ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు.సెక్స్ అనేది వ్యాయామానికి ప్రతిరూపం లాంటిది. కాబట్టి గర్భిణీలు సెక్స్ చేయడం వారికి వ్యాయామంగా పనికొచ్చి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. గర్భధారణ సాధారణంగా మహిళ రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. ఆ సమయంలో సంభోగంలో పాల్గొనడం వల్ల వారిలో ఇమ్యునిటీ పెరుగుతుంది. గర్భం ధరించిన స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితి అలాగే కడుపులో బిడ్డ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని సెక్స్ లో పాల్గొనాలి. ముందుగా వైద్యుడి సలహా అనేది ముఖ్యం.. !!