ఆడవాళ్లలో నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు.. !!
అందుకే కొన్ని వంటింటి టిప్స్ ద్వారా నెలసరిలో వచ్చే నొప్పిని నియంత్రించవచ్చు. హార్మోనుల సమతుల్యతను కాపాడటానికి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, పాలు, గ్రుడ్లు, పండ్లు, కాయగూరలు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.నిత్యం, యోగా, ప్రాణాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని నివారించటానికి ధ్యానం చేయాలి.నొప్పి వస్తున్న ప్రాంతములో వేడి నీటితో ఒక గంటపాటు కాపడము పెట్టాలి. ఈ టైములో పొగలు కక్కే టీ తాగితే ఎంతో మంచిది. వేడి టీ తాగడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో అల్లం, పిప్పర్‌మెంట్, లావెండర్, గ్రీన్ టీ, లెబన్‌గ్రాస్ వంటి హెర్బల్ టీలు తాగితే మంచిది. హెర్బల్ టీలు తాగడం వల్ల అలసట పోతుంది. నొప్పి కూడా తగ్గుతుంది.
బహిష్టు సమయంలో నీరు ఎంత తాగితే అంత మంచిది. ఈ టైములో కనీసం ఆరు నుంచి ఏడు గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీర ఆరోగ్యం బాగా ఉంటుంది. బహిష్టు సమయాల్లో వచ్చే నొప్పులు, తిమ్మిర్లపై అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం వాడకం వల్ల ప్రిమెనుసు్ట్రవల్ సిండ్రోమ్ కారణంగా వచ్చే అలసట కూడా పోతుంది. అన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయమేమిటంటే కొంతమందికి బహిష్టులు సరిగా రావు. ఇలాంటి వారికి ఇది మందులా పనిచేస్తుంది. అందుకే ఈ టైములో చిన్న అల్లంముక్కను తీసుకుని దాన్ని మెత్తగా చేసి నీళ్లల్లో వేసి ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఆ నీళ్లను వడగొట్టి అందులో కాస్తంత తేనె, నిమ్మరసం కలిపి తాగాలి.దీనిని నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి ఉన్న సమయంలో రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.. !!Powered by Froala Editor