అమ్మ : గర్భంతో ఉన్న మహిళ తీపి పదర్ధాలు తినడం మంచిదేనా.. !!!

Suma Kallamadi

కడుపులో కడుపులో బిడ్డని మోస్తూనపుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. లేదంటే తల్లితో పాటు బిడ్డకి కూడా ప్రమాదమే.కడుపుతో ఉన్న మహిళకు చాలా రకాల కోరికలు ఉంటాయి.ఏవేవో తినాలని అనిపిస్తుంది. రకరకాల ఫుడ్ ఐటెమ్స్ తినాలపించడం సహజమేనని, గర్భవతులకి వాళ్ళు ఏం తినాలని కోరుకుంటే అవి చేసి పెట్టాలని చెబుతారు. ప్రెగ్నెంట్ సమయంలో తినే ఆహారం తల్లినీ, బిడ్డనీ కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా పంచదార ఎక్కువ ఉన్న పదార్ధాలు వీలైనంత తగ్గించమని వారు సలహా ఇస్తున్నారు.

 

 

 

షుగర్ ఎక్కువ తీసుకోవడం మామూలుగానే మంచిది కాదని మనందరికీ తెలిసిన విషయమే. కానీ, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఆ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే తల్లి, బిడ్డ కొన్ని రకాల  ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల తల్లీ, బిడ్డా కూడా ఒబేసిటీ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సి రావచ్చు. పిల్లలు పుట్టే సమయానికే ఎక్కువ బరువు ఉండొచ్చు, పుట్టాక బరువు పెరగొచ్చు. పిల్లలకే కాక తల్లికి కూడా ఇది సమస్యనే. షుగర్ ఎక్కువ ఉన్న పదార్ధాలు తీసుకోవడం వాళ్ళు ఎక్కువగా  బరువు పెరుగుతారు. మామూలు ప్రెగ్నెన్సీ వెయిట్ కన్నా ఇలా పెరిగిన వెయిట్ తగ్గడానికి చాలా సమయం పడుతుంది.

 

 

 

 

తల్లులు ప్రెగ్నెంట్ టైమ్‌లో స్వీట్స్ ఎక్కువగా తింటే పిల్లలకి చిన్నప్పుడే గుండెకి సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది   అందుకని, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తియ్యగా ఏమైనా తినాలనిపిస్తే పండ్లు తినడం మంచిది. పంచదార కలపకుండా పండ్ల రసం తీసుకోవచ్చు. లేదా బెల్లంతో చేసిన పదార్ధాలు కూడా తినవచ్చు. మరీ ఐస్ క్రీమ్, చాక్లెట్టో తినాలనిపిస్తే తినండి, కానీ, కొంచెం తినండి. అంటే, సింపుల్ గా చెప్పాలంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తల్లి పంచదార ఎక్కువ ఉన్న పదార్ధాలు ఎక్కువగా తింటే ఆ పిల్లల పుట్టిన తర్వాత కొద్దిగా చురుకుదనం లోపంతో ఉంటారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: