అమ్మ : మనం చేసే ప్రతి పనిలో ఆవిడని తలవాలిసిందే కదా.. !!

Suma Kallamadi

 

అమ్మ అంటే  కనిపించని దేవత.. మన అందరి అవసరాలు తీర్చే దేవత అమ్మ. అయితే అందరి అవసరాలు తీర్చడానికి అమ్మ కావాలి.ప్రతి దానికి అమ్మ కావాలి  పొద్దున్నే నిద్రలేవగానే కాఫీకి అమ్మ, టూత్ పేస్ట్ కనపడకపోతే అమ్మ, స్నానానికి సోప్ అయిపోతే అమ్మ,టిఫిన్ వడ్డించడానికి అమ్మ, ఆ టిఫిన్ తినేటప్పుడు ఎక్కిళ్ళు వస్తే నీళ్ళకి అమ్మ, ఖర్చులకి నాన్నని డబ్బులు అడగడానికి అమ్మ, భోజనం చేసేటప్పుడు tv ఛానల్ మార్చడానికి అమ్మ,నీ బట్టలు ఉతకడానికి అమ్మ, సాయంత్రం ఆకలేస్తే అమ్మ,బయట తిరుగుతున్నప్పుడు చిన్న దెబ్బ తగిలితే అమ్మ,తగిలిన ఆ దెబ్బకి మందు రాయడానికీ అమ్మ.ఇలా పొద్దున్నుంచి పడుకునే వరకు ప్రతీదానికి అమ్మ మీదనే ఆధారపడి ఉంటున్నాం. 

 

 

ఒక రోజులో అమ్మ మన కోసం చేసే పనులు ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు, ఇంటినుంచే వెళ్ళే ఉధ్యోగస్తులు అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే...ఒక్కసారి హాస్టల్లో ఉండి చూడండి, అమ్మ మనకోసం ఎంతలా ఇల్లంతా పరిగెట్టిందో, మన అవసరాలని తీర్చడానికి ఎన్ని కష్టాలు  పడిందో అర్ధం అవుతుంది.అటువంటి అమ్మకోసం, సెలవులకి ఇంటికెళ్ళినప్పుడు వంట చేస్తే తప్పేంటి..? ఇల్లు ఊడ్చి అంట్లు కడిగితే మాత్రం తప్పేంటి...? హాస్టల్లో నువ్వే ఉతుక్కునే బట్టలు ఇంటిదగ్గర కూడా ఉతికితే తప్పేంటి?అమ్మ చేతిలో పని లాక్కొని ఆమెకి కొంచెం విశ్రాంతి ఇస్తే తప్పేంటి?

 

 

ఎవరో అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు అని ఆత్మహత్య చేసుకునే చాలా మంది సోదరులకు,మన గురించే ఎప్పుడూ ఆలోచించే అమ్మ ప్రేమ ఎందుకు అర్ధం కావట్లేదో నాకిప్పటికీ భోధ పడడం లేదు..పురిటి నెప్పులని కూడా హాయిగా భరించే ఆ తల్లి, కొడుక్కి చిన్న కష్టం కలగగానే కన్నీళ్ళు కార్చేస్తుంది పాపం పిచ్చి తల్లి.. !! ఇంకా మనం అమ్మని ఎప్పటికి అర్ధం చేసుకుంటామో ఏమో కదా.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: