కావలసిన పధార్ధాలు :
బాసుమతి బియ్యం : 2 కప్పులు
కాలీప్లవర్ : 2 కప్పులు
ఉల్లిపాయలు : 1 కప్పు (సన్నగా పొడవుగా కట్ చేసినవి)
పన్నీర్ : 250 గ్రాములు
లవంగాలు : నాలుగు
నల్ల యాలకులు : నాలుగు
నెయ్యి : (నూనె) 10 చెంచాలు
కారప్పొడి : 1 చెంచా
బంగాళదుంపలు : రెండు
పచ్చిబఠాణీ : 1 కప్పు
దాల్చిన చెక్క : రెండు అంగుళాలు
బిరంజి ఆకు : రెండు
జీలకర్ర : 1 స్పూను
నిమ్మకాయ : రెండు
తయారీ చేయువిధానం :
బాస్మతి బియ్యం కడిగి 10 నిమిషాలు నాననిచ్చి నీరు వంచేసి బాండీలో 1 చంచా నెయ్యివేసి తడి ఇంకేంత వరకు బియ్యాన్ని వేసి వేపాలి. బాండీలో నెయ్య వేసి పన్నీర్ ముక్కలను వేసి ఎర్రగా వేసి తీసి వేడి నీటిలో కొంచెం మెత్తగా అయిన తర్వాత తీసి వేరుగా ఉంచాలి. మిగిలిన నేతిలో ఉల్లిముక్కలు వేసి వేరుగా ఉంచాలి.
తర్వాత దినుసులన్నీ వేసి వేరుగా ఉంచాలి. తర్వాత దినుసులన్నీ వేసి వేగిన తర్వాత కూరలు, బఠాణీకి, ఉప్పు వేసి ఐదు నిమిషాలు సెగమీద బియ్యాన్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నిమ్మరసం పిండి బాగా కలియబెట్టి దించి పైన ఉల్లిముక్కలు, పన్నీరు ముక్కలు అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: