పాదాల పగుళ్ళకి ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు..!!!

Suma Kallamadi

ఆడవాళ్ళ అందమైన నడకలో పాదాలకు ప్రాధాన్యత వుంది. హంస గమనంలో నడవడానికి చక్కని ఆరోగ్యవంతమైన కాళ్ళు ఎంతో అవసరం. కాళ్ళను ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా కాపాడుకుంటుంటే కాళ్ళనొప్పులు, పాదాలకు పగుళ్ళు లాంటి సమస్యలనుండి ఎంచక్కా  దూరంగా ఉండవచ్చు.పాదాల మీద శ్రద్ద తీసుకోకపోవడం, పోషకాహార లోపము పాదాల పగుళ్ళకు కారణమౌతున్నాయి.అలాంటి వారు కొన్ని నివారణోపాయాలు పాటిస్తే పాదాల సౌందర్యం మీసొంతం అవుతుంది.

 

ఇది ఒక బెస్ట్ మంచి చిట్కా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఖర్చుతక్కువ, ఫలితమెక్కువ కాబట్టి. ఒక బౌల్లో రాళ్ళ ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ వేసి అందులో గోరు వెచ్చని నీళ్ళు పోసి అందులో కాళ్ళు మునిగేలా కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఇరవై నిముషాల తర్వాత స్ర్కబ్బర్ తో స్ర్కబ్ చేయాలి. మెత్తబడిన కాళ్ళనుండి మృత చర్మం తొలగిపోయి అందంగా మారుతాయి. శుభ్రం చేసిన తర్వాత కొద్దిగా గ్లిజరిన్, రోజ్ వాటర్, నిమ్మరసం మళ్ళి మిక్స్ చేసి చిక్కని పేస్ట్ ను శుభ్రం చేసి కాళ్ళకు పట్టించి ఆరనివ్వాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 

అవసరం  ఐతే పడుకొనే ముందు కాళ్ళకు సాక్సులు ధరించుకోవచ్చు.బాగా పండిన అరటిపండును బాగా గుజ్జులా చేసి పగిలిన పాదాలకు అలాగే పట్టించాలి. పది పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మెత్తబడుతాయి. ఇలా ప్రతి రోజూ కూడా చేయొచ్చు. ఎక్కువగా పాదాల పగుళ్ళున్నప్పుడు అవొకాడో ఫ్రూట్ మసాజ్ బాగా పనిచేస్తుంది. సగభాగం అవొకాడో లేదా పచ్చికొబ్బరి తీసుకొని మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసి అరటిపండు గుజ్జుకు కలిపి కాళ్ళకు పట్టించి మసాజ్ చేయాలి. అవొకాడో లేదా పచ్చికొబ్బరిలో ఎసెన్సియల్ ఆయిల్స్, మినిరల్స్, విటమిన్ ఉండటం చేత పొడిబారిన  పాదాల పగుళ్ళను పోగొడుతుంది. పగుళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. అరటి బదులు బొప్పాయిని కూడా వాడుకోవచ్చు.

 

మీ పాదాలు ఎప్పుడు పొడి బారి పగుళ్ళు ఏర్పడుతుంటే తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్, మరియు బియ్యం పిండితో కలిపి బాగా రఫ్ గా పేస్ట్ చేసి కాళ్ళకు పట్టించాలి. తర్వతా ఒక బకెట్లో పాదాలు మునిగేలా గోరువెచ్చని నీళ్ళు పోసి అందులో బాదాం ఆయిల్, లేదా ఆలివ్ ఆయిల్ వేసి పాదాలను అందులో డిప్ చేసి కొద్దిసేపు నాననివ్వాలి. పది నిముషాల తర్వాత బయటకు తీసి బాగా స్ర్కబ్ చేసినట్లైతే సున్నితమైన పాదాలు  మీ సొంతం అవుతాయి.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: