'లాక్ డౌన్'లో మహిళలు ఇలా వత్తిడి తగ్గించుకోండి!

Durga Writes

పుట్టినప్పటి నుండి చదువుకోవడం.. చదివి ఆ చదువుకు తగ్గ ఉద్యోగం చేసే సమయానికి ఇంట్లో వారి వత్తిడికి గురి చేసి పెళ్లి చేసి అత్తింటికి పంపడం.. అక్కడ భర్త వేరే ఊరు కావడంతో ఉమ్మడి కుటుంబం కాకుండా బయట ఉండటం వల్ల భర్త ఉద్యోగానికి వెళ్తే ఇంట్లో మాట్లాడే వారు లేక ఆలోచనలు ఎక్కువై వత్తిడికి గురై మానసికంగా కుంగిపోవడం వంటివి మనం ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నాం. 

 

ఇంకా అలాంటి వత్తిడి ఈ లాక్ డౌన్ లో మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అప్పుడు కనీసం బయటకు వచ్చేవాళ్ళు.. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది కాబట్టి.. ఇంకా అలాంటి వారు వత్తిడిని జయించాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.. ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

రోజు కాసేపు వ్యాయామం చెయ్యాలి.. అలా చెయ్యడం వల్ల ఎండార్ఫిన్ల ఆందోళన, ఒత్తడిని తగ్గించేస్తుంది. ఇంకా శరరీక శ్రమ వల్ల శరీరం ప్రశాంతంగా నిద్రపడుతుంది. 

 

గ్రీన్ టీ సమయానికి తాగడం వల్ల మంచిది.. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటె చేపలు, అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. 

 

అంతేకాదు.. ఒత్తిడికి గురి చేస్తున్న విషయాలను ఒకచోటా రాసుకోండి.. ఆతర్వాత ఆ సమస్యలు నుండి బయటపడే మార్గాలు నిదానంగా ఆలోచించచ్చు.. 

 

అంతేకాదు.. ఇంట్లో కాళీగా ఉండి పదే పదే ఆలోచించడం వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది.. అందుకే సానుకూల అంశాల గురించి ఆలోచించడం మంచిది. 

 

సాధ్యమైనంత వరుకు కాఫి, టీలకు దూరంగా ఉండండి.. అయితే కెఫీన్ ను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అని నిపుణులు చెప్తున్నారు. 

 

మరి అసలు సంగతి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: