అమ్మ : ప్రాణం అనే పదం చాలా చిన్నది.. ! అమ్మా అనే మాట కన్నా.. !

Suma Kallamadi

“అమ్మ ప్రేమ” ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే ఎందుకంటే  తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటి లేదు కాబట్టి. మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే “అమ్మ”.శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే “అమ్మా”.అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ? కొలిస్తే నే పలికేది ఆ దేవుడు…కాని పిలవకుండానే పలికేది “అమ్మ మనసు” మాత్రమే..ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు.

 

 

కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు అదే “అమ్మ ప్రేమ”. మనకు "ప్రాణం” అనే పదం చాలా చిన్నది “అమ్మ” అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.మనం ఎంత ద్వేషించినా గాని మన మీద ప్రేమని కురిపిస్తుంది. మన భాధని తన బాధగా భరిస్తుంది. సహనానికి మరో పేరే అమ్మ. అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం…!సుస్వాగతం..!అమ్మ గురించి మట్లాడండి ఆ మాట కు ఉన్న విలువని మారింత పెంచండి.కొంత వయస్సు వచ్చిన తరువాత, ప్రతివారికీ, భార్య, భర్త, పిల్లలతో, సంసార భాద్యతలు యేర్పడతాయి. దానితో పాటే, వ్యక్తిగత ప్రేమలు, మమకారాలు వుంటాయి.

 

 

అంతమాత్రాన వాటినుండి తల్లి, తండ్రిని దూరం చేయవలసిన అవసరం వుండదు. మెంటాలిటీ వెరైటీసుకు, వయసు ఒక్కటే కారణం కాదు.సంసారo, సహజ జీవితంతో  వ్యక్తిగతాన్ని సర్దుకుపోతూ వుండాలి! ఆర్ధికంగా భద్రతతో పాటు, వాళ్ళనీ ఫ్యామిలీతోపాటే  వుండనిస్తే  వాళ్ళకు తృప్తిగ వుంటుంది. సాధారణంగా తమ పిల్లలు వ్యక్తిగత కుటుంబీకులైన తరువాత పుత్ర ప్రేమ కంటె, పౌత్ర ప్రేమే మక్కువగా వుంటుంది. మనుమలు, మనునరాండ్లతో, ముచ్చట పడాలనే మనసు వుంటుంది వృద్ధులకు. అలాంటి ముచ్చటకి  వాళ్ళని దూరం చేయకండి మిత్రులారా..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: