పల్లీల ఫ్రై తిన్నారా? ఎంత బాగుంటుందో తెలుసా?
పల్లీల ఫ్రై.. ఎంత బాగుంటుందో తెలుసా? నోరూరించే పల్లీలు అంటే పిల్లల నుండి పెద్దల వరుకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి రుచికరమైన పల్లీల ఫ్రై ని ఇంట్లోనే పిల్లల కోసం చేసి పెట్టండి. ఇప్పుడు ఎలాగో లాక్ డౌన్ కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు.. బయట ఆహారం తీసుకోము కాబట్టి.. ఇంకా చాకొలెట్లకు, బిస్కెట్లకు నో చెప్పి ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ పల్లీలను సాయింత్రం సమయంలో ఫ్రై చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ పల్లీల ఫ్రై ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి..
కావాల్సిన పదార్ధాలు..
పల్లీలు 100 - గ్రాములు,
నూనె - తిరువాతకు తగినంత,
ఆవాలు, జీలకర్ర - తిరువాతకు సరిపడేంత,
కర్వేపాకు - 3 రెమ్మలు,
ఉప్పు, కారం - సరిపడేంత.
తయారీ విధానం..
ఒక గిన్నెలో పల్లీలను తీసుకొని అందులో నీళ్లు వేసి ఉడకబెట్టాలి.. ఆ తర్వాత చిన్న మంటపై పాన్ పెట్టి నూనెను వేడి చెయ్యాలి.. ఆలా వేడి చేసిన తర్వాత నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపట అన్నాక అందులో కర్వేపాకు వేసి ఆ తర్వాత అందులోకి పల్లీలు వేసి వేయించాలి. ఆతర్వాత ఆ పల్లీలలోకి కాస్త ఉప్పు, కారం వేసి వేయించాలి. అంతే పల్లీల ఫ్రై రెడీ అవుతుంది. ఇది పిల్లలకు సాయింత్రం సమయంలో స్నాక్స్ లా పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.