అక్కడ భార్యలని పంచుకుంటారు..... !!!!

మన భారత దేశంలో భార్యభర్తల బంధాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఒకసారి పెళ్లయ్యిందంటే.. భార్య లేదా భర్త పరాయి వ్యక్తులను కన్నెత్తి కూడా చూడకూడదనేది మన భారత సాంప్రదాయం. ఇండియాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు వివాహ బంధానికి విలువనిస్తాయి. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం భార్య భర్తల బంధాలు శాస్వతంగా ఉండవు. కొన్నాళ్లు సహజీవనం చేసిన తర్వాత.. ఆమె లేదా అతడికి నచ్చితేనే ఆ బంధం పెళ్లి వరకు వెళ్తుంది. లేకపోతే ఎవరి దారి వారిదే...


ఉత్తర అమెరికా, తూర్పు సైబీరియాలోని ఆర్కిటిక్‌ ప్రాంతంలో నివసించే ప్రజలు వింత సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అక్కడ ఒకరి భార్యను మరొకరితో పంచుకుంటారు. ఇలా భార్యలను మార్చుకోవడం వెనుక బలమైన కారణం ఉందని అక్కడివాళ్లు చెబుతారు. ఆర్కిటిక్ ఉష్ణోగ్రతలు భిన్నంగా ఉంటాయి. అక్కడ నిత్యం మంచు తుఫాన్లు, వరదలు తదితర విపత్తులు సంభవిస్తాయి. దుష్టశక్తుల వల్లే ఈ విపత్తులు ఏర్పడతాయని అక్కడి ప్రజలు భావిస్తారు. భార్యలను మార్చుకోవడం ద్వారా ఆ దుష్టశక్తులు గందరగోళానికి గురవ్వుతాయని, విపత్తులు రావాని నమ్ముతారు.


పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ఈ సాంప్రదాయం గురించి తెలిస్తే మీరు ఇంకా థ్రిల్లింగ్‌గా ఫీలవుతారు. అక్కడ నివసించే నిగర్ తెగ ఆదివాసీలు.. పెద్దలు చేసే పెళ్లికి కట్టుబడి ఉండరు. అక్కడ ఏటా నిర్వహించే గెరేవాల్ ఫెస్టివల్‌లో.. పురుషులు తమ మర్మాంగాలు కనిపించేలా వింతైన మేకప్, దుస్తులు ధరించి మహిళలను ఆకట్టుకుంటారు. అందులో ఎవరైనా కొత్తగా పెళ్లయిన యువతులు ఉంటే.. వారిని ఎత్తుకెళ్లిపోతారు. అలా ఎత్తుకెళ్ళిన వ్యక్తికి ఆమె మళ్లీ భార్య అవుతుంది. అక్కడి సమాజం కూడా వారిని గుర్తిస్తుంది. అయితే, ఈ సాంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదు.


పెళ్లి తర్వాత పరాయి భార్య, లేదా భర్త.. ఇతరులపై మోజుపడటాన్ని సమాజం తప్పుగా భావిస్తోంది. అలా చేయడం వల్ల భార్యభర్తల మధ్య స్పర్థలు కూడా తలెత్తుతాయి. భర్త ఒక్కడే వేరే యువతితో సెక్స్‌లో పాల్గొంటే.. భార్యను అన్యాయం చేసినట్లవుతుంది. అదే భార్య కూడా తనకు ఇష్టమైన ఇంకో వ్యక్తితో పడక సుఖాన్ని పంచుకుంటే.. ఆ ఇద్దరిలో తప్పు చేశామనే భావనే ఉండదని నమ్ముతారు. దాని ఫలితంగానే ఇటీవల ఈ ట్రెండ్ విచ్చలవిడిగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: