ఎంతో సులువుగా టేస్టీ టేస్టీ `ట‌మాటా రైస్‌`

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
టమాటాలు- మూడు
రైస్-  రెండు క‌ప్పులు
అల్లం ముక్క‌- చిన్న‌ది
వెల్లుల్లి- ఐదు రెబ్బ‌లు

 

ఉల్లిపాయలు- ఒక‌టి
యాలకులు- రెండు
దాల్చిన చెక్క- చిన్న‌వి రెండు
లవంగాలు- ఐదు

 

నూనె- త‌గినంత‌ 
పచ్చిమిర్చి- మూడు
పుదీనా- కొద్దిగా
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమీర‌- కొద్దిగా


 
త‌యారీ విధానం:
ముందుగా బియ్యంలో కొద్దిగా ఉప్పు, స‌రిప‌డా నీరు పోసి ఉడికించి ప‌క్క‌న పెట్టుకోవాలి. త‌ర్వాత అల్లం, వెల్లుల్లిని మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకొని అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కాక ల‌వంగాలు, దాల్చిన చెక్క, యాల‌కులు వేయాలి. అవి వేగాక అందులో ఉల్లిపాయ ముక్క‌లు, స‌న్న‌గా త‌రిగిన పచ్చి మిర్చి, పుదీనా ఆకుల‌ను వేసి బాగా వేయించాలి. ఆ త‌ర్వాత ట‌మాటా ముక్క‌లు, కొద్దిగా వాట‌ర్ పోసి మొత్తం మిశ్ర‌మాన్ని క‌లుపుతూ మ‌గ్గ‌నివ్వాలి.

 

ఇప్పుడు అందులో ముందుగా త‌యారు చేసుకున్న అల్లం వెల్లులి పేస్ట్, స‌రిప‌డా ఉప్పు కూడా వేసి కాస్త మ‌గ్గ‌నివ్వాలి. ఆ త‌ర్వాత వండిన అన్నం వేసి బాగా క‌లపాలి. చివ‌రిగా స‌న్న‌గా త‌రిగిన కొత్తిమీర‌ను వేసి క‌లిపి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువుగా టేస్టీ టేస్టీ ట‌మాటా రైస్ రెడీ..!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: