నట్ ఆరెంజ్ పలావు తయారీలో వాడే పధార్ధాలు :
బాస్మతీ రైస్ : 3 కిలోలు
బాదంపప్పు : 2 చెంచాలు
పిస్తాపప్పు : 2 చెంచాలు
కమలాలు : 5
జీడిపప్పు : 2 చెంచాలు
కిస్మీస్ : 2 చెంచాలు
వైట్ పెపర్ : 1 చెంచా
నెయ్యి : అర కప్పు
యాలకులు : 4
బిరియాని ఆకులు : 4
జాజికాయ పొడి : ¼ చెంచా
యాలకుల పొడి : ¼ చెంచా
క్రిస్టల్ షుగర్ : చెంచాడు
సాఫ్రాన్ : చిటికెడు
దాల్చినచెక్క : 2 అంగుళాల ముక్క
జాపత్రి పొడి : ¼
గరంమసాలా : ¼ చెంచా
ఉప్పు : రుచికి
సరిపడ తయారీ ఎలా :
ముందుగా రైస్ కడిగి నీరంతా వార్చి ప్లేటులో పోసి బాగా ఆరనివ్వాలి. కమలాపండు తొక్కతీస తొనలు విడదీయాలి. తొనలు పై పొర, విత్తనాలు తీసి మొత్తం తొనలను ప్రక్కన పెట్టి ఉంచాలి. సాఫ్రాన్ను టైట్ గా వేసి పావుకప్పు గోరువెచ్చని పాలలో కుంకుమపువు వేసి కలిపి ఉంచాలి. కోవాను చిన్నగా పీసెస్ చేసి ఉంచాలి.
తడి పొడిగా ఆరిన బియ్యంలో 2 చెంచాల నెయ్యి, అన్ని రకాల పప్పులు, కిస్ మిస్, వైట్ పెప్పర్, కోవా, క్రిస్టల్ షుగర్ కలిపి ఉంచాలి. ప్రెషర్ ప్యాన్ లో మిగితా నెయ్యి వేసి బిరియాని ఆకులు , లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేపాలి. వీటికి బియ్యం మిశ్రమం కలిపి రెండు నిమిషాలపాటు కలుపుతూ వేపాలి.
ఈ లోపల కొన్ని తొనలను ఉంచి మిగతా తొనలతో రసం చేసుకోవాలి. ఈ రసం మరియు సరిపడ 200 మి, లీ, నీరు కలిపి ఉడికించాలి. ఉడుకురాగానే తీసి వేగుతున్న బియ్యంలో కలపాలి. సరిపడ ఉప్పు, గరంమసాలా వేసి కలపాలి. ఎసరు ఉడికి బుడగలు వస్తున్నపుడు మూతపెట్టి మంట తగ్గించి ఉడికించాలి.
అన్నం దాదాపుగా ఉడికి నీరంతా ఇగిరి బుడగలు వస్తున్నప్పుడు మిగిలిన కమలా తొనలు ముక్కలు, జాపత్రి పొడి, జాజికాయ, యాలకుల పొడి, సాఫ్రాన్ ఉన్నపాలు పోసి మూతపెట్టి గట్టిగా గిన్నెను పట్టకొని ఎగరవేసినట్టుగా కలపాలి. గరిటితో కలుపుతూ ముక్కుల చిదుముతాయి.
గనుక ఈ విధంగా చేసి కలిసేలా చేయాలి. 5 నిమిషాలు పాటు సన్నని మంట మీద ఉంచి తరువాత పావుగంట సేపు మూతపెట్టి ఉంచాలి. తరువాత తీసి వేడి వేడిగా రైతా, కర్రీలతో సర్వ్ చేసుకోండి.
మరింత సమాచారం తెలుసుకోండి: