ఆడపిల్ల పుట్టిందని.. కన్నతండ్రే దారుణానికి ఒడిగట్టాడు..

frame ఆడపిల్ల పుట్టిందని.. కన్నతండ్రే దారుణానికి ఒడిగట్టాడు..

Chakravarthi Kalyan

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఆడపిల్ల అమ్మకానికి వచ్చింది. కనులుతెరవని పసిగుడ్డుని కన్నవాళ్లే అమ్మకానికి పెట్టారు. గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది.


ఇందుకు కారణం పుట్టింది ఆడపిల్ల కావడమే.. కేవలం 8రోజుల బిడ్డను కన్న తండ్రే అమ్మకానికి బేరం పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థనగర్ కు చెందిన రజిత నాలుగేళ్ళ క్రితం ఈ రాజేష్ ను ప్రేమ వివాహం చేసుకుంది. రజితకు మొదటి కాన్పులో మగ బిడ్డ పుట్టాడు.


తాజాగా వారం రోజుల క్రితం రెండోసారి ప్రసవించింది. రెండో కాన్పులో ఆడ కవలలు పుట్టారు. ఇద్దరు ఆడ పిల్లలు కవలలు అన్నమాట. ఆడ పిల్లలు కావడంతో పెంచి పెద్దలేమని భావించాడా తండ్రి..


అందుకే ఒక పిల్లను ఉంచుకుని.. మరో పిల్లను అమ్మకానికి పెట్టాడు. లక్షన్నర రూపాయలకు బేరం కూడా కుదిరింది. ఈ విషయం తెలిసి రజిత తండ్రి అల్లుడితో గొడవపడ్డాడు. మామ-అల్లుడు మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. దీంతో విషయం కాస్తా వెలుగు చూసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More