ఆలూ పరోటా

VALIVETI HARI KRISHNA
కావలసిన పదార్థాలు : గోధుమ పిండి - రెండు కప్పులు, నెయ్యి లేదా నూనె - తగినంత, పంచదార - అర టీ స్పూన్ ఉప్పు - రుచికి సరిపడ బంగాళదుంపలు - రెండు కొత్తిమీర - ఒక కట్ట అల్లం వెల్లుల్లి ఫేస్ట్ - ఒక స్పూన్‌ పచ్చిమిర్చి - రెండు    తయారు చేయు విధానం : గోధుమ పిండిలో ఉప్పు, వేడి చేసిన నూనె కొంచెం, అర టీ స్ఫూన్ పంచదార, నీళ్ళు పోసి ముద్దులా కలిపి పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత చిదిమి పెట్టుకోవాలి. ఉప్పు కొంచెం, పచ్చిమిర్చి, కొత్తిమీర మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫేస్ట్ ను, కొత్తిమీర ఫేస్ట్ బంగాళదుంపలకు కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. గోధుమ పిండిని చిన్న చిన్న పూరీలుగా వత్తుకొని, ఒక్కొక్క దాని మధ్యలో బంగాళాదుంప ఉండను పెట్టి, నాలుగు మూలలు మడిచి, మందంగా కాస్త పెద్ద పూరీలుగా వత్తుకోవాలి. పెనం మీద నెయ్యి లేదా నూనెతో కాల్చుకోవాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా కూర ఉన్నా, లేకపోయినా పర్వాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: