చంద్ర కాంతలు
ఒక గిన్నెలోకి పిండిని చేర్చి కొబ్బరి తురుములు ఆ పిండిలో వేయాలి. పంచదారని కలిపి స్టవ్మీద పెట్టి సన్నని సెగమీద అడుగంటకుండా గరిటతో కలియ పెట్టుతుండాలి. అరగంట గడిచేసరికి పంచదార పాకంగా మారి. పెసర పిండిలోని నీరంతా ఆవిరి అయి గట్టిపడుతుంది. నేతితో వేయించిన జీడిపప్పుని కీస్మిస్ని వేసి కలపాలి. కుంకమపువ్వుని కూడా వేసి క్రిందకు దించాలి. తరవాత తెల్లటి మందపాటి గుడ్డను నీటిలో తడిపి పిండాలి. ఆ తడి బట్టని పీటమీద సాఫీగా పరిచి ఆ గుడ్డ మీద పెసర పిండిని పోసి పలుచగా వత్తాలి.
పిండి చల్లారిన తరువాత చాకుతో డైమండ్స్లాగాగానీ, బిస్కెట్లలాగాగానీ కోసుకోవచ్చు, కోసిన ముక్కలను తీసి ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత బాండీలో నెయ్యి పోసి కాగాక, కోసి వుంచిన బిళ్ళల్ని వేసి కాలిస్తే పొంగి గుల్లగా ఉంటాయి. వీటిని మరీ ఎర్రగా కాలనివ్వకుండా గోధమరంగులో వేగనిచ్చి తీసి బౌల్లో వేసుకోవాలి..