చేపల్లో ఎన్నో విలువైన పోషక పధార్థాలు

Durga
మాంసాహారంలో చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. త్వరగా జీర్ణమవుతుంది. ఇది పిల్లలు, పెద్దలు అందరూ తీసుకోవాలిస ఆహారం. గుండె వ్యాది ఉన్నవాళ్లకు కూడా డాక్టర్లు వారానికి రెండుసార్లు చేపలు తింటే మంచిదని తెలియజేశారు. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. చేపల్లో ఎన్నో విలువైన పోషక పధార్థాలు లభిస్తాయి. మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, పాస్పరస్, ఇతర ఖనిజములు కూడా చేపలలో పుష్కలంగా ఉంటాయి.  ఇక ఈ పులుసుకు కొరమేను చేపలైతేనే బావుంటుంది. కేజీకి తగ్గకుండా ఉండే చేపను తీసుకుంటే అందుల ముళ్లు తక్కవగా ఉంటాయి.  చేపపులుసుకు కావాలిసిన వస్తువులు :  చేపలు : 1 కేజీ  చింతపండు పులుసు : 1 కప్పు ఉల్లిపాయలు :2 అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లు జీలకర్ర పొడి: 1 స్పూన్ మెంతిపొడి : ½ టీ స్పూన్ కొబ్బరిపొడి : 3 టీ స్పూన్లు ధనియాల పొడి : టేబుల్ స్పూన్ పసుపు : ¼ టీ స్పూన్ కారం పొడి : 1 టేబుల్ స్పూన్  ఉప్పు : తగినంత నిమ్మరసం : 1 టేబుల్ స్పూన్ నూనె : 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు : 2 రెబ్బలు చేపముక్కలు శుభ్రం చేసి నిమ్మరసం పట్టించి పక్కన పెట్టుకోవాలి. దీనివలన నీసు వాసన తగ్గుతుంది. ప్యాన్ లో చెంచాడు నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు వేయించి పొడిచేసుకోవాలి. లేదా పొడులు ఉంటే అలాగే వాడుకోవచ్చు. కాని తాజాగా వేయించి పొడి చేసుకుంటే వచ్చే రుచి చాలా బావుంటుంది. ఏ వంటకంలోనైనా, చింతపండు పులుసు చిక్కగా కాక, పలుచగా కాకుండా తీసుకోవాలి. ఈ పులుసులో ఉల్లిపాయ ముద్ద, పసుపు, కరివేపాకు, తగినంత ఉప్పు, నూనె చేప ముక్కలు వేసి కలిపి చిన్నమంటపై ఉడికించాలి.  చేపముక్కలు మసాలాలు కలిపిన పులుసులో ఉడికితే చాలా రుచిగా ఉంటాయి. నూనె తేలేవరకు ఉడికాక దింపివేయాలి. వేడిగా కంటే చేపల పులుసు చల్లారిన తర్వాత ఇంకా రుచిగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో చేపల పులుసు చేసిన మరుసటిరోజు జొన్న రొట్టేలతోపాటు ఆరగిస్తారు. అప్పడే దాని అసలన రుచి తెలస్తుందాంటారు మరి....  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: