కావలసిన పదార్దములు :
బియ్యం : అరకిలో
మామిడికాయ : ఒకటి పెద్దది
ఎండిమిర్చి: ఆరు
దనియాలు : రెండు టీ స్పూన్లు
జీలకర్ర : టీ స్పూన్
కొబ్బరి ముక్కలు : అర కప్పు
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
పోపుదినుసులు : టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం :
ముందుగా బియ్యం కడిగి పొడిపొడిగా అన్నం వండి పక్కన పెట్టాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఎండిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేపాలి. వీటిని మిక్సి జార్లో వేసి మిక్సి పట్టాలి. ఇవి మెత్తగా అయ్యిన తరువాత మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు, పసుపు కాస్త ఉప్పు వేసి మెత్తగా మిక్సి పట్టాలి.
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు టీ స్పూన్లు నూనె వేసి కాగిన తరువాత , మిక్సి వేసిన మామిడి మిశ్రమం వేసి పచ్చి వాసన పోయేవరకు వేపి, దానిలో వండిన అన్నం, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మిగిలిన నూనె వేసి కాగిన తరువాత పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు, వేరుసెనగగింజలు వేసి వేగాక స్టవ్ ఆపి ఈ పోపును మామిడి, కొబ్బరి మిశ్రమం కలిపిన అన్నంలో వేసి కలపాలి. అంతే మామిడి కొబ్బరి పులిహోర రెడీ.
మరింత సమాచారం తెలుసుకోండి: