మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్‌లో ' మ‌న్యం ధీరుడు ' కు బెస్ట్ సినిమా అవార్డ్‌

RAMAKRISHNA S.S.
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డు 2026 గాను ఆర్ వి వి సత్యనారాయణ నటించి నిర్మించిన చిత్రం మన్యం ధీరుడు కు ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. మలేషియా తెలుగు సంఘం క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో సుందర్ పెరుమాళ్ ఆలయం ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగిన ఉగాది వేడుకలలో ఉగాది పురస్కార్ 2026 ఉత్తమ చిత్ర అవార్డును మన్యం ధీరుడు చిత్రానికి ఇవ్వడం జరిగింది.

 

మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయరావు చేతుల మీదుగా ఆర్ వి వి సత్యనారాయణ మరియు శ్రీమతి ఆర్ పార్వతి దేవి దంపతులను ఘనంగా సత్కరించి పురస్కార ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులు సుబ్రమణ్యం రామానాయుడు కమిటీ మెంబర్స్ 600 మంది తెలుగు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

 

ముఖ్యఅతిథి పోలీస్ కమిషనర్ విజయరావు మాట్లాడుతూ మన తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గాధను మన్యం ధీరుడు పేరును తరికెక్కిచ్చిన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఆర్ వి వి సత్యనారాయణకు ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సినిమాలో దేశభక్తిని చాటుతూ ఒక దేశభక్తి గీతాన్ని ఆలపించి ఆ గీతం భారతదేశంలో ప్రతి పౌరుడు ఆలపించే విధంగా ఆ పాటను తీర్చిదిద్దారు ఆర్ వి సత్యనారాయణ గారు అని కొనియాడారు.



9490520108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్య‌లు, ఎమ్మెల్యేల ప‌నితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్ర‌జ‌ల ఇబ్బందులు, అక్క‌డ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌రిస్థితులు, రాజ‌కీయ అంశాల‌పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: