ఉసిరి మసాలా స్పెషల్

Durga
కావలసిన పదార్థాలు : ఉసిరికాయలు:  10 ఉల్లిపాయలు:  2 పచ్చిమిర్చి : 4 నూనె : తగినంత అల్లంవెల్లుల్లి :  1/2 టీస్పూన్ కారం :  1/2 టీస్పూన్. పసుపు:  1/4 టీస్పూన్. పెరుగు:  1/2 కప్పు శొంఠిపొడి:  1/4 టీస్పూన్. గరంమసాలా :  చిటికెడు కర్భూజ విత్తనాలు:  25 గ్రా. కొబ్బరి :  కాస్తంత గసగసాలు :  3 టీస్పూన్. ఉప్పు:  తగినంత తయారీ విధానం:   ఉసిరికాయల్ని చాకుతో గాట్లు పెట్టి ఉప్పు వేసి వేడినీళ్లలో 5 నిమిషాలు ఉడికించి తీయాలి. తరువాత కొంచెం నూనెలో వేయించి తీసి పక్కనపెట్టాలి. విడిగా ఓ గిన్నెలో కర్బూజ విత్తనాల్ని వేయించి తీయాలి. వీటిని కొబ్బరి, గసాలుతో కలిపి మెత్తని ముద్దలా నూరాలి. ఓ బాణెలిలో కొంచెం నూనె వేసి ముందుగా సన్నని ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా వేయించాలి. అందులోనే అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, గసాల ముద్దను కూడా వేసి నూనె తేలేవరకూ వేయించాలి. అర కప్పు పెరుగు వేసి కలిపి ఉడికించాలి. ఇప్పుడు గరంమసాలా, శొంఠిపొడి వేసి గ్రేవీలా చేయాలి. ముందే వేయించి పక్కన ఉంచిన ఉసిరికాయల్ని ఇందులో వేసి కలపాలి. అంతే ఉసిరి మసాలా స్పెషల్ రెఢీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: