తయారీలో వాడే పధార్థాలు :
బాస్మతి రైస్ :250 గ్రా.
ఉల్లిపాయలు : 3
బంగాళదుంపలు : 4
గ్రీన్పీస్ :1/2 కప్పు
వంకాయలు : 3 పెద్దవి
కొత్తిమీర : కొంచెం
ధనియాలపొడి : 11/2 చెంచా
కారం :3/4 చెంచా
ఎండకొబ్బరి తురుము : ½ కప్పు
జీలకర్ర : 1 చెంచా
నూనె : ¾ చెంచా
ఉప్పు : సరిపడ
పంచదార : 3/4 చెంచా
గరం మసాలా :1/2చెంచా
తయారీ ఎలా ?
ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాలి. బంగాళదుంపలు చెక్కుతీసి ముక్కలు చేసి నీటిలో ఉంచాలి.
వంకాయలకు కూడా 11/2 అంగుళం పొడవు ముక్కలు కట్ చేసి ఉప్పు వేసి నీటిలో వేసి ఉంచాలి.
మిక్సీలో జీలకర్ర, ధనియాలపొడి, కారం,ఉప్పు, గరంమసాలా, కొబ్బరితురుము, వేసి మెత్తగా పేస్టు వేసి వేపి దానికి బంగాళదుంప ముక్కలు,వంకాయ ముక్కలు, పచ్చిబఠాణీ, ఉల్లిముక్కలు వేసి 1 నిమిషం వేపాలి.
వీటికి కొంచెం నీరు కలిపి సన్నని మంట మీద ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరువాత కొత్తిమీర చల్లి దింపాలి. అన్నం విడిగా ఉడికించి పెద్ద బేసిన్ లో పోసి ఆ అన్నం ఉడకించిన కర్రీ వేసి గరిటతో అన్నంలో కలిసేలా బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి.
10 నిమిషాల తరువాత వేడి వేడిగా సర్వ్ చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: