విజయం మీదే: దృఢమైన సంకల్పమే విజయానికి మూలం !

VAMSI
అన్నీ అందరికీ అందుబాటులో ఉండవు. కొన్ని వాటంతట అవే అదృష్టవశాత్తు దొరుకుతాయి. మరికొన్ని మనమే కష్టపడి సంపాదించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో బ్రతకడమే ఒక లక్ష్యంగా మారిపోయింది. నిజమే ఒక సామాన్యుడు ప్రస్తుత కాస్ట్లీ లైఫ్ లో సగటు మనిషి జీవించడం చాలా కష్టతరం అయిపోయింది. కోరుకున్నది కడుపుకి తినాలన్నా, కోరుకున్న దుస్తులు కొనాలన్నా, మంచి ఇంట్లో ఉండాలన్నా , వసతులు కావాలన్నా కనీసం మంచి నీళ్ళు తాగాలన్నా అన్నిటికీ డబ్బులు వెచ్చించాల్సిందే. ప్రతి దానికి డబ్బులు పోయాల్సిందే. ఇక కాలం తో పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో సమయానికి పనులు జరగాలి అంటే వాహనాలు తప్పనిసరి.
అయితే వాహనాలు ఎలాగోలా కొనుక్కుంటే సామాన్యుడు దాన్ని వినియోగించుకోవడానికి  పడే బాధలు అన్నీ ఇన్ని కావు. అంతగా ఇబ్బంది పెడుతున్నాయి తరచూ పెరుగుతున్న పెట్రోల్, డీజల్ ధరలు. కడుపు నింపుకోవడానికే అష్ట కష్టాలు పడుతున్న ఈ రోజుల్లో ఇక వాహనాలకు పెట్రోల్ ఎలా పోస్తారు. సంతోషంగా ఉండటానికి కూడా ఖర్చు చేయాల్సిందే. అలాగని డబ్బు పెడితేనే సంతోషం అని కాదు కానీ ... అయితే సినిమా చూడాలన్నా, ఏ పార్క్ కో, బయటకో వెళ్ళాలన్నా కూడా సామాన్యుడు ఆలోచించాల్సిందే.  అందుకే సామాన్యుడికి సంతోషంగా బ్రతకడం కూడా ప్రతిక్షణం ఒక లక్ష్యంగా మారుతోంది. అయితే ఇందుకు పరిష్కారం లేకపోలేదు.
మనపై మనకు విశ్వాసం ఉండాలి. సాధించాలనే తపన, పోటీ తత్వం, గెలవాలనే తపన, మన కుటుంబాన్ని హాయిగా పోషించుకోవాలి అన్నవి బలంగా ఉంటే మార్గాన్ని మనమే ఏర్పాటు చేసుకోగలం, దైర్యం దానికదే వస్తుంది లక్ష్యాన్ని చేదించగలరు. చాలా మంది సామాన్యుడి స్థాయి నుండి అత్యున్నత స్థాయిలకు ఎదగాలి అనుకునే వారే. వారి విజయ రహస్యాలు కూడా ఇవే. అయితే మన లక్ష్యం దృఢంగా ఉండాలే కానీ అనుకున్నది సాధించడం అసాధ్యమేమీ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: