విజయం మీదే: వైఫల్యాన్ని ఎదుర్కోవడం ఎలా ?

VAMSI
ప్రముఖ ఆచార్య మహానుభావుడు , జ్ఞాని అయిన చాణక్యుడి విధానాలు నేటి కాలంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉన్న విషయం తెలిసిందే. ఈయన విధానాలను, బోధనలను పాటించే వారు చాలామందే ఉన్నారు. వాటిని అనుసరించడం వలన వారి జీవితాలు చాలా సంతోషంగా , సజావుగా సాగిస్తున్నాయి అని అంటున్నారు. ఆయన బోధనలు చాలానే ఉండగా వాటిలో ఒకటైన...వైఫల్యాన్ని అడ్డుకోవడం ఎలా..!! వైఫల్యం ఎదురు కాకుండా విజయం అందుకోవడం ఎలా అన్న విషయం గురించి ఇపుడు తెలుసుకుందాం. చాణుక్యుని విధానాలను అనుసరిస్తే, జీవితంలో అనేక విజయ మార్గాలు తెరుచుకుంటాయి అన్నది అక్షర సత్యం.
జీవితంలో విజయంతో పాటు ఆనందాన్ని అందుకోవాలి అంటే సమస్యలను దూరం చేసుకోవాలి, వాటిని అధిగమించగలగాలి. చాణక్య నీతిలో సమస్యలను తప్పించుకునే ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. అయితే సమస్యను చూసే కోణాన్ని బట్టి అది పెద్దదిగా లేదా చిన్నదిగా కనిపిస్తుందని, అందుకే మన దృష్టిని నియంత్రించాలి అని అంటుంటారు ఆచార్య. సమస్య ఏదైనా దానిని పరిష్కరించగలం అనే ఆత్మ విశ్వాసం మీలో ఉండాలి. చాణక్యుడి నీతి ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు చాలా విషయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.  చాణక్య నీతి ప్రకారం, ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం బుద్ధిశాలి లక్షణం. అది ముందు చూపు కూడా. అంతే కాకుండా ఇందుకోసం ఆ రంగంలో నిపుణులు అయినా, అనుభవజ్ఞులైన వారి సహాయం తీసుకుంటే మరింత మంచిది అంటారు.  
ఒకసారి ప్రణాళిక పూర్తి అయ్యింది అంటే దాని ఆధారంగా ముందుకుసాగాలి.  ఎవరైతే తమ పనిని ఉత్తమంగా, ఒక పద్దతి ప్రకారం  ప్రారంభిస్తారో వారు చేసే ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు. సమయం విలువను గుర్తించలేని, అర్దం చేసుకోలేని వ్యక్తి  విజయాన్ని ఆస్వాదించలేరని ఆచార్య చాణక్య అన్నారు.  ఈ కోవకి చెందిన వారికి విజయం అనేది ఒక పెద్ద శిఖరం లాంటిది. ఆ శిఖరాన్ని ఎక్కే కొద్దీ మరింత భయంతో వెనక్కి తగ్గుతారు. అలాగే శరీరం ఆరోగ్యంగా ,మనం సంతోషంగా ఉన్నప్పుడే సామర్థ్యం కూడా పెరుగుతుంది అంటారు. అందుకనే ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి, సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇలాంటి వారికి విజయం అంది వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: