విజయం మీదే: ఈ వ్యాపారం ద్వారా చక్కని లాభాలు మీవే?

VAMSI
త్వరగా ఆర్దికంగా స్థిరపడాలని అనుకునేవారికి వ్యాపారం ఒక చక్కటి ఆప్షన్.. అయితే ఇక్కడ రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ క్లిక్ అయితే మాత్రం..మీరే రాజు మీరే మంత్రి అన్నట్టుగా ఉంటుంది మీ పొజిషన్. అందుకే వ్యాపారం బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ ముఖ్యంగా అది అన్ని మెళుకువలు, ఎత్తుపల్లాలపై అవగాహన కలిగినపుడే అని చెప్పాలి. ఇక సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అందులోనూ ఆ వ్యాపారం ఇంటి దగ్గర నుండే మేనేజ్ చేసేది గా ఉండాలి అనుకుంటున్నారా.. అయితే ఈ ఆన్లైన్ బిజినెస్ పై ఓ లుక్ వేయండి...మీకు సెట్ అవుతుందేమో చూడండి. అలెర్ట్ గా ఉంటూ పట్టుదలతో కృషి చేస్తే విజయం మీ సొంతం అవుతుంది. అందులోనూ ఇది అన్ని సీజన్ లలోనూ మంచి డిమాండ్ ఉండే బిజినెస్ కావడం మరో ప్రత్యేకత.
వ్యాపారం ఏమిటంటే మసాలా మేకింగ్ యూనిట్. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు.  తక్కువ పెట్టుబడి ఉన్నా సరిపోతుంది. సక్సెస్ అయితే మాత్రం లాభాలకు కొదవ ఉండదు. మన దేశంలో  సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉందని అందరికీ తెలిసిందే. దేశంలో మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే వీటిని కనుక వినియోగించుకుని మసాలాలు తయారు చేసి ఆన్లైన్ లో మార్కెటింగ్ చేయగలిగితే మంచి లాభాలు అందుకోవచ్చు. మీ స్థానికంగా ఉండే ప్రజల ఆహారపు అలవాట్లు, వారి అభిరుచులకు అనుగుణంగా మీరు మసాలాలు తయారు చేస్తే ఈజీగా అమ్మడు పోతాయి.
అలాగే వాటిని ఆప్లైన్ లోనే కాకుండా ఆన్లైన్ లోనూ అందుబాటులో ఉంచితే బాగా వర్కౌట్ అవుతుంది.  ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్  నివేదికలో, సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు పూర్తి బ్లూప్రింట్ తయారు చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం.. సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు ఉంటే సరిపోతుంది. ఇందులో 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డు ఏర్పాటుకు పోగా రూ.60,000, పరికరాలు మరియు రూ.40,000. ఇది కాకుండా అదితర సంబంధిత పనులు ప్రారంభించేందుకు గాను రూ.2.50 లక్షలు అవసరం అవుతుంది. ఈ మొత్తంలో మీ వ్యాపారం ప్రారంభించి కాస్త పబ్లిసిటీ చేసుకోగలిగితే విజయం మీ సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: