విజయం మీదే: లక్ష్యసాధన కోసం సరైన ప్రణాళిక అవసరం !

VAMSI
ఇంతకు ముందు మనము చాలా సార్లు చెప్పుకున్న విషయమే అయినా సందర్భం మరియు ప్రస్తుతం ట్రెండ్ ని బట్టి చెప్పాల్సి వస్తోంది. మనిషి అన్నాక అదో ఒక లక్ష్యం తోనే బ్రతుకు సాగిస్తాడు. మన ఆకాంక్ష లేదా ద్యేయమే లక్ష్యం అని అనవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. మరి కొందరు బహుళ లక్ష్యాలను కలిగి ఉంటారు.  కోరుకున్న లేదా ఎంచుకున్న ఫలితాన్ని చేరుకోవడానికి, సొంతం చేసుకోవడానికి ఒక   ప్రణాళికను తయారు చేసుకొని ఒక క్రమ పద్ధతి ప్రకారం అభివృద్ధిని సాధిస్తూ లక్ష్యం లోని చివరి స్థానానికి చేరుకోవడానికి విజయం పొందటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. అయితే అందరూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. వ్యక్తి నిర్ణీత సమయానికి తమ లక్ష్యాన్ని చేదించనంత మాత్రాన వారికి  దృఢనిశ్చయం లేదని వారిలో పట్టుదల తక్కువ అంచనా వేయకూడదు.
అలాగే ఆ వ్యక్తి కూడా తన సామర్ధ్యం గురించి తక్కువగా ఆలోచించకూడదు.. ఈ సారి అందలేదు అంటే అందుకు గల కారణాలను అర్దం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి విషయంలో చరిత్రలో జరిగిన ఒక సంఘటన గుర్తించుకోవాలి. గజనీ మహమ్మద్ 18 సార్లు దండెత్తి చివరికి విజయాన్ని సాధించాడు. ఇక్కడ ఆ 17 సార్లలో ఒకసారైనా తన వల్ల ఇక కాదు అని విసుగు చెంది నిరాశ పడి ఉంటే విజయం దక్కేదా... ఎన్ని సార్లు ఓడిపోయినా చివరికి దక్కే విజయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.. నలుగురిలో మిమ్మల్ని గొప్పగా నిలబడుతుంది.
అందుకే ధ్యేయం యొక్క ఉద్దేశం ఎపుడు స్థిరంగా ఉండాలి చివరి వరకు ప్రయత్నించాలి. ప్రయాణించే మార్గంలో అనుకూలతలతో పాటుగా ప్రతి చర్యలు కూడా ఎదురవుతాయి. కానీ అన్నిటినీ అధిగమించాలి. నిబద్దతతో ముందుకు సాగితే విజయం మిమ్మల్ని వరిస్తుంది. అంతే కానీ ఏ ప్రణాళిక అందుకు తగిన ప్రయత్నం లేకపోతే ఎందులోనూ విజయాన్ని సాధించలేరు .
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: