విజయం మీదే: పని కావట్లేదా... ఈ లోపాలున్నాయా చూసుకోండి?

VAMSI
మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించి మన చుట్టూ ఉన్న సమాజములో గౌరవంగా బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అనుకున్న వెంటనే జరిగి పోయే పని అయితే ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరూ కష్ట పడరు. అందుకే మనము ఏది సాధించాలి అన్నా దానికి తగిన శ్రమ చేయక తప్పదు. అయితే కొందరు ఎంత ప్రయత్నిస్తున్నా అనుకున్న పని లేదా లక్ష్యాన్ని చేరుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని అనుకుంటున్నారా ? ఎంత ప్రయత్నిస్తున్నా అనుకున్న విజయం అందటం లేదా... కారణం ఏమిటి ఎందుకు అనుకున్నది సాదించలేక పోతున్నాం అన్న విషయం అర్దం కావడం లేదా.... అయితే మీలో ఈ లోపాలు ఏమైనా ఉన్నాయేమో ఒక సారి సరి చూసుకోండి, ఒకవేళ ఉన్నట్లైతే వాటిని సరిదిద్దుకుని మీ ఈ ప్రయత్నాన్ని మళ్ళీ కొనసాగించండి.
మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంచుకున్న మార్గం లేదా ప్రణాళిక సరిగా ఉందా లేదా అన్న అంశంపై దృష్టి కేంద్రీకరించండి. ఉదాహరణకు మీరు గవర్నమెంట్ టీచర్ కావాలన్నది మీ లక్ష్యం అయితే పెద్దగా ప్రయత్నించకుండా ... ఒకటి రెండు పుస్తకాలు తిరగేస్తూ జాబ్ రాలేదంటూ ఆవేదన చెందితే సరి పోదు. టీచర్ జాబ్ లు సెలెక్ట్ అవ్వడానికి కావలసిన అభ్యసన ఖచ్చితంగా చేయడం అవసరం. అందుకు తగిన ప్రణాళిక అవసరం. ఇలాగ సగం చేసి సగం చేయకుండా ఉంటే ఆ పని ఫలితం కూడా సగం సగం గానే మిగిలి పోతుంది. అదే విధంగా లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రయత్నాలను దాదాపు గా చేరుకున్నాం అనే సమయంలో ఆ సంతోషంతో కుతూహలం ఎక్కువ అయిపోయి ఇంకెంత ఇదిగో చేతి కందే అంతా దూరం అని లైట్ తీసుకుంటే అంతే సంగతులు.. అనుకున్నది పూర్తిగా సాధించే వరకు కూడా అంతే శ్రద్ధగా ప్రయత్నించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: