విజయం మీదే: యువత...ఆలోచనలెలా ఉన్నాయో తెలుసా?

VAMSI
మామూలుగా నేటి కాలంలో చూస్కుంటే ఒక మనిషి ఏదో ఒక విధంగా లైఫ్ లో సెటిల్ కావాలని నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. అయితే ఒక యువకుడు ఏ విధంగా తన లైఫ్ లో సెటిల్ కావడానికి ప్రయత్నిస్తాడు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అయితే నేడు మనము చూస్తున్న యువత మాత్రం లైఫ్ లో సెటిల్ అవ్వడానికి సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుంటున్నారు. అందులోనే డెవలప్ కావడానికి స్కోప్ ఉందని నమ్ముతున్నారు. అయితే వారి ఆలోచన మంచిదే అయినా కొన్ని సార్లు ఏ దారిలో వెళ్ళినా ముళ్ళు లాంటి కష్టాలు ఉంటాయి.
అయితే సోషల్ మీడియానే నమ్ముకున్న యువతకు ఎటువంటి కష్టాలు ఎదురవుతాయి. అలా ఎదురైన కష్టాలను ఎలా అధిగమించాలి అన్నది ఇప్పుడు చూద్దాం.  సోషల్ మీడియా అంటే అదొక అగాధం... మీరు బాగా సృజనాత్మకతతో ఆలోచించి వర్క్ అవుట్ చేస్తే సోషల్ మీడియా ద్వారా తక్కువ కాలం లోనే కోట్లు సంపాదించవచ్చు. అయితే అందుకోసం మీరు ఏమి చేయగలరు అన్నది ముందుగా డిసైడ్ చేసుకోవాలి. ఉదాహరణకు మీకు కథలు చెప్పడం బాగా ఇష్టం అనుకుంటే... మంచి నీతి కలిగిన కథల్ని రాసుకుని, వాటిని ఒక చిన్న వీడియో ద్వారా క్రియేట్ చేసుకుని యూట్యూబ్ లేదా ఫేస్ బుక్ లో ఒక ఛానల్ ను పెట్టుకుని అందులో ఆ వీడియోస్ అప్ లోడ్ చేస్తూ రావాలి.
అలా మీ వీడియోస్ రోజు రోజుకీ మరింత మందికి చేరువ అవుతూ ఉంటాయి. మీ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకుంటే, వ్యూస్ బాగా వచ్చిన తీవ్రత  మీకు రెవెన్యూ జెనరేట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినంత గా మూడు లైన్ లలో డబ్బు రాదు. మొదటగా మీ వీడియోస్ అందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేసుకోవాలి. ప్రతి కథలోనూ ఎదో ఒక నీతి, విలువ మరియు నైతికత ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.  దీని కోసం చాలా సమయం అవసరం అవుతుంది.. అలాగే మొదట్లో కాస్త డబ్బు అయినా పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ చేశాక మీకు కొంత కాలం తర్వాత ఛానెల్ క్లిక్ అయితే ఇక డబ్బే డబ్బు. సో... అవకాశాలు ఎప్పుడూ రావు మనమే అందిపుచ్చుకోవాలి. మనలోని సృజనాత్మకతను వెలికి తీసి దానికి కొన్ని మెలకువలు దిద్ది సోషల్ మీడియాలో వదిలి సొమ్ము చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: