విజయం మీదే: ఇంట గెలిచి రచ్చ గెలువు...

VAMSI
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెత వినే ఉంటారు. ఇది నిజమే అసలైన విజయం అంటే బయట నలుగురిలో మీరు కోరుకున్న విజయం అందుకోవడం మాత్రమే కాదు. ఆ విజయం మీ ఇంట్లోని వారికి సంతోషాన్ని అందించాలి. నీ మనుషులు అనుకునే వారితో కూడా విజయాన్ని సగర్వంగా చెప్పుకోగలగాలి. అపుడే నీ విజయం నీ వారి విజయం కూడా అవుతుంది. లేదంటే అటువంటి సక్సెస్ కు అంత ప్రాముఖ్యత లభించదు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులతో ఎపుడు కస్సుబుస్సులాడుతుంటాడు. తను అనుకున్న వ్యాపారంలో లాభాలు గడించి కోరుకున్న స్థాయిలో నిలబడి అందరి ముందు తన విజయాన్ని చూపించాలి అని అనుకున్నారు.
అయితే బయట తన వ్యాపారం కోసం ఎంతో కష్టపడి , కృషి చేసే ఆ వ్యక్తి ఇంట్లోని వారితో మాత్రం ఏమి చేయడు, ఏమి పెద్దగా పట్టించుకోడు. అయితే చివరికి తాను అనుకున్నది అనుకున్నట్లు సాధించాడు. బయట అందరి తోనూ శబాష్ అనిపించుకున్నాడు.  కానీ అప్పటికే ఇంట్లోని వారంతా అతడి వైఖరితో విసిగిపోయాడు, అతడితో ఇంకా జీవితాన్ని కొనసాగించడం కష్టం అని భావించారు. దాంతో అందరి ఆ వ్యక్తిని వెలివేసినట్లు విడిచి వెళ్ళిపోయారు.  తన విజయాన్ని తన వాళ్ళతో పంచుకోవాలని ఇంటికి వచ్చిన ఆ వ్యక్తికి తన వాళ్ళు ఎవరు కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. ఆఖరికి విషయాన్ని తెలుసుకుని కుంగిపోయాడు.
ఆ తరువాత వారి కోసం వెతికి వెతికి చివరాఖరికి తన వాళ్ళను కలుసుకుని వారికి నచ్చ చెప్పి తిరిగి ఇంటికి తీసుకొచ్చి వారితో సంతోషంగా జీవనం కొనసాగించాడు. ఇలా అందరి విషయం లోనూ అదృష్టం కలిసి రాక పోవచ్చు. మీ విజయం ఇంటి బయటే కాదు. ఇంటి లోపల కూడా అవసరమే. మీ వారు మనసులను గెలుచుకోవడం కూడా ఒక విజయమే. తన అనుకున్న వారిని బాధపెట్టి సాధించేది ఏమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: