విజయం మీదే: సెంటిమెంట్ ను కాదు... కష్టాన్ని నమ్ముకో

VAMSI
సెంటిమెంట్ తో విజయం వరిస్తుంది అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అంటే ఏమైనా పని చేయాలి అన్నప్పుడు ముందుగా మంచి రోజు సమయం చూస్తుంటారు. అలా చేయడం వలన చేస్తున్న పనికి ఎటువంటి ఆటంకం కలుగకుండా విజయం చేకూరుతుందని ఒక విశ్వాసం. అయితే ఇది ఎంత వరకు కరెక్ట్. నిజంగా ముహూర్తం చూడకుండా చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదా అని చాలా మందికి అనుమానం వుండవచ్చు. అయితే ఇందుకు అనుభవజ్ఞులు చెబుతున్న మాట ఏమిటంటే, దాదాపు అన్ని శుభకార్యాలు, వ్యాపారాలు, ఉద్యోగానికి ఇంకా పలు వాటి కొరకు ముందుగా ముహూర్తం చూసి ఆ పనిని మొదలు పెడతారు.
అలాగని అలా ముహూర్తం చూసుకుని మరి మొదలు పెట్టిన ప్రతి పని సఫలీకృతం అవుతున్నాయా? మంచి ఫలితాలనే ఇస్తున్నాయా అంటే  కాదు కదా  అలా తల పెట్టిన పనుల్లో కొన్ని ఆశించిన ఫలితాన్ని ఇవ్వగా మరి కొన్ని నిరాశను మిగులుస్తాయి. మరి ముహూర్తం మాట ఏమిటి. ముహూర్తం అనేది మన పురాతన కాలం నుండి వస్తున్నది. మన సెంటిమెంట్ ప్రకారం కోరుకున్న విజయాన్ని అందుకోవాలి అంటే ముహూర్తం పరిపాటిగా ఆచరిస్తూ వస్తున్నది, మంచి మనసుతో ఎవరికి నష్టం కలుగకుండా ఉండేది అయి మీ కృషి అందుకు తోడైతే చాలు విజయం తప్పకుండా మీ వెంట నిలుస్తుంది.
అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైనా పనిని చేయాలి అనుకున్నప్పుడు ముహూర్తాలను లేదా సెంటిమెంట్ లను నమ్మడం వేరు. అలాగే వాటినే నమ్ముకుని పని తీరును మార్చుకోవడం వేరు. ముంధుగా మీరు చేసే పనిపై దృష్టిని నిలిపి కష్టపడుతూ వెళ్ళాలి. అంతే కానీ సెంటిమెంట్ పై పూర్తి భారాన్ని వేసి పనిని వదిలేయడం మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వలన ఎటువంటి పనిని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: