విజయం మీదే: మీ లక్ష్యం ఏమిటి... ఎలా ఎంచుకోవాలి?

VAMSI
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటారు. అందరికీ ఇది చాలా ముఖ్యమైంది. అందు కోసం ముందుగా మీరు ఇందులో ప్రావీణ్యులో గ్రహించండి. మనకు తెల్సిన విషయం లోనే ముందుకు వెళ్లడం మన అభివృద్ధికి మంచిది. అంతే కానీ తెలియని విషయం కోసం ఎంత పోరాడినా ఉపయోగం ఉండదు. అందుకే మీకు తగిన లక్ష్యాన్ని ఎంచుకోవాలి. దానితో మీ జీవన పోరాటం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా లక్ష్యాన్ని ఎంచుకోవడంలో లేట్ అయినా, అలాగే లక్ష్యం ఎంచుకోవడంలో కన్ఫ్యుజ్ అయినా బండి ముందుకు కదలదు.
వాస్తవంగా చూస్తే ఇది నిజమేనని అర్దమవుతుంది. అవును చాలా మంది తమ లక్ష్యాన్ని ఎంచుకోవాలని అనుకుంటారు. కానీ వారు తమకు తగ్గట్లుగా ఎలాంటి లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. తమకు తగ్గట్టుగా ఎలాంటి లక్ష్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని పలు విధాలుగా ఆలోచిస్తుంటారు. లక్ష్యం అనేది అసాధ్యంగా ఉండ కూడదు, మరీ అనాలోచితంగా ఉండ కూడదు. అసలు లక్ష్యం ఎంచుకోవడం ఎలా అన్న అంశం గురించి కొందరు నిపుణులు చెబుతున్న సూచనలు ఏమిటో ఇపుడు చూద్దాం.
లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత అసలు సినిమా మొదలు అవుతుంది. మీరు ఎలా ముందుకు వెళ్లాలో ముందుగా ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రణాళికను మిస్ అవ్వకూడదు. ఒక వేళ అందులో ఏమైనా సమస్య వస్తే తప్పించి ప్రణాళికను మాత్రమే ఫాలో అవ్వాలి. ఒకవేళ మీరు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం సక్సెస్ కాకపోతే వెంటనే ప్లాన్ 2 మీ దగ్గర ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఇలా మొదటి నుండి అనుకున్న ప్రకారం అన్ని పనులను సమర్ధవంతంగా చేసుకుంటూ వెళితే విజయం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈ విషయం ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాస్తవం. ఇక ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్ళండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: