విజయం మీదే: "గెలిచి కాదు - గెలిపించి చూడు" బాసూ...
అవి ఏమిటో ఒకసారి చూద్దాం, తాము ఎవరినైతే మన అనుకుంటూ వారి కోసం వారి విజయం కోసం కష్టపడుతారో వారు కూడా మీపై అలాంటి అంకిత భావాన్ని కలిగి వుండాలి, వారు కూడా మీ గురించి ఆలోచించగలగాలి. సాయం అందించే చేయి ప్రతి ఫలాన్ని ఆశించకూడదు నిజమే కానీ గుడ్డిగా త్యాగాలు చేయకూడదు. మీ పురోగతి, మీ విజయం కూడా ముఖ్యమే అలాగని ఇంకెవరినీ పట్టించుకోవద్దు అనడం లేదు. కానీ మీరు ఎవరి కోసం అయితే కష్టపడుతూ వారి కోసం మీ విజయాన్ని కూడా వదులుకుంటున్నారో వారి జీవితంలో వెలుగులు నింపండి.
ఎప్పుడూ స్వార్ధంగా జీవించకండి. ఇది మనిషిని నిలువునా నాశనం చేస్తుంది. ఈ రోజు నువ్వు ఒకరికి సహాయం చేస్తే, ఆ సహాయమే నీకు మంచి రూపంలో నీకు ఉపయోగపడుతుంది, అంతే కానీ వారు ఎలా పోతే మనకేంటి అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటివి అన్నీ మీకు తెలియాలంటే ఒక వ్యక్తిని గెలవడం కాదు. ఒకసారి గెలిపించి చూడు అసలు విషయం నీకే అర్దమవుతుంది .