విజయం మీదే: ఈ లక్షణాలు ఉంటే... ఈ సంవత్సరం మీదే?

VAMSI
2020, 2021 సంవత్సరాలు మనుషుల జీవితాలను ఎంతగా ప్రభావితం చేశాయో, ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కున్నామో ప్రతి ఒక్కరూ అనుభవించిన వారే. కొందరు తమ వారి ప్రాణాలు పోతున్నా చూస్తూ ఏమి చేయలేని దీన స్థితిలో ఉండి పోతే, ఇంకొందరు తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డెక్కారు, మరి కొందరు నష్టాలలో కూరుకు పోయారు, దాదాపు ఆర్థికంగా నష్టపోయారు. ఇలా ఈ రెండు సంవత్సరాలు ఎవరికీ కలిసి రాలేదు. రెండేళ్ల పాటు కరోనా మన జీవితాలను శాసించింది. ఇపుడు కూడా ఒమిక్రాన్ అంటూ కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి దేశంలో రోజురోజుకీ పెరుగుతోంది.
అయితే పలువురు వైద్య శాస్త్రవేత్తలు ఇది పెద్దగా ప్రమాదం కాదని అంటున్నారు. ఏదేమైనా ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోక తప్పదు, ఎదురించక తప్పదు. ఏదేమైనా అంతా మంచే జరగాలని, అందరి జీవితాల్లో ఈ నూతన సంవత్సరం కొత్త వెలుగులు తీసుకు రావాలని కోరుకుందాం. అలాగే కోరుకున్న విజయాలను అందించాలని ఆశిద్దాం. అయితే ఈ నూతన సంవత్సరం మీకు విజయం చేకూర్చాలని అనుకుంటే మీరు మీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే అంటున్నారు అనుభవజ్ఞులు.  అవేంటో ఇపుడు చూద్దాం.
మీరు ఎంటి..??? మీ బలాలు అలాగే బలహీనతల్ని ఒకసారి చెక్ చేసుకోండి. వాటికి అనుగుణంగా మీ లక్ష్యాన్ని ఛేదించడానికి గురి పెట్టుకోండి. ఈ నూతన సంవత్సరంలో మీరు పూర్తి చేయాలనుకుంటున్న పనులను లిస్ట్ ఔట్ చేసుకోండి. వాటికి సమయ పరిధిని పెట్టుకోండి, ఆ లోపు పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్దం చేసుకోండి. మనిషి అన్న తరవాత కష్ట, నష్టాలు, అనారోగ్య సమస్యలు సాధారణమే అయినా మిమ్మల్ని మీరు దృఢం చేసుకోండి. అంతా మన మంచికే అనుకుని ముందుకు సాగడం నేర్చుకోండి. ఏ సందర్భం లోనూ అనవసరంగా బాధపడుతూ ఆగిపోకండి. ఈ సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఆలోచన ఇదే మిమ్మల్ని మీరు కోరుకున్న విజయానికి చేరుస్తుంది. ఎపుడు కూడా మీ ఆలోచనలు ఉన్నతంగా, పాజిటివ్ గా, సమంజసంగా ఉండాలి. విజయం మీదే అనుకున్నది సాధించడానికి సిద్దం కండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: