విజయం మీదే: పడేసిన కొబ్బరి బోండాలతో లక్షలు...

VAMSI
మెదడుకు పదును పెట్టాలే కానీ ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఏదో ఒకటి సాధించాలనే దృఢమైన సంకల్పంతో, శ్రమించ గలిగే తత్వంతో ముందుకు సాగే వారికి మట్టి కూడా మాణిక్యాలను ఇస్తుందనడానికి ఈ యువకుడి జీవితమే ఆదర్శం. తెలివి ఎక్కడి నుండో రాదు. మన ఆలోచనల నుండే పుడుతుంది. ఇప్పుడు ఈ కథ తెలిస్తే మీరందరూ ముక్కున వేలేసుకుంటారు. అంతలా చేశాడు ఒక యువకుడు. అయితే అసలు ఏమి జరిగిందో చూద్దాం రండి.
మాములుగా మనకు వేడి చేసినా లేదా ఆరోగ్యం బాగా లేక పోయినా కొబ్బరి బోండాలను తాగమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అలా తగిన తర్వాత ఆ ఖాళీ బోండాలను బయట పడేస్తూ ఉంటాము. ఇలా పడేసిన బోండాలను ఒక కుర్రాడు తన ఆలోచనతో వాడుకుని లక్షలు సంపాదిస్తున్నాడట. ఇది విన్న వారికి ఒక్క సారిగా మతి పోయినంత పనయింది. కానీ ఇది నిజం. హైదరాబాద్ కు చెందిన నాగరాజు అనే యువకుడు  సిటీలో తాగి పడేసే కొబ్బరి బొండాలను క్యాష్ చేసుకోవాలని ఆలోచించాడు. కొబ్బరి బొండాల నుండి ముడి సరుకును ఉత్పత్తి చేసి దాని ద్వారా వ్యాపారం చేయాలనే ఆలోచన తట్టింది.
వెంటనే సిటీకి దూరంగా ఒక ప్లాంట్ పెట్టాడు. సొంతంగా అందుకు కావల్సిన యంత్రాలను తయారు చేయించుకున్నాడు. అందులో 12 మందికి పని కల్పించాడు. సిటీలో వ్యర్ధంగా పడి ఉన్న కొబ్బరి బోండాలను సేకరించి  వాటి నుంచి  వివిధ వస్తువుల తయారీకి ఉపయోగపడేటటువంటి ముడి సరుకును ఉత్పత్తి చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిత్యం  వీటిని సేకరించి మూడు టన్నుల ఖాళీ కొబ్బరి బొండాల నుండి 50 శాతం పీచు, 50 శాతం కొబ్బరి ఎరువును తయారు చేసి ఆ మిగతా సరుకును వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ వ్యాపారం చేసి లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: