విజయం మీదే: అవకాశం కోసం ఎదురుచూడకు... ఎదురెళ్ళు

VAMSI
నాకు ఓ లక్ష్యం ఉంది అని చెప్పుకుంటే సరిపోదు. ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించాలి. ఫలించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అంతేకానీ లక్ష్యాన్ని ఎంచుకుని నిమ్మళంగా ఉంటే విజయం నీ చెంతకు నడుచుకుంటూ రాదు. ఏదో అద్భుతం జరుగుతుందని తీరిగ్గా కూర్చుంటే ఓటమి తప్పదు. ఏమి చేయాలో ఆలోచించి ముందుకు సాగితే గెలుపు నిన్ను చేరక మారదు . ఒక వ్యక్తి చాలా దూరం ప్రయాణించి బాగా అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఎంతో ఆకలితో చుట్టూ తినడానికి ఏమైనా దొరుకుతుందా అని చూసాడు. చెట్టు పైన మామిడి పళ్ళు కనిపించాయి. అయితే అవి ఎలా తినాలి, నాకు చెట్టు ఎక్కడం రాదుగా అంటూ దిగులుగా కూర్చున్నాడు.
గాలికైనా రాలిపడుతాయేమో అని ఎదురుచూస్తూనే ఉన్నాడు. గంటలు మారుతున్నాయి మరింత నీరసించిపోతున్నాడు అయినా ఎంతసేపు పండు దానికదే తన ముందు పడాలి అనుకుంటున్నాడు. కానీ పండును ఎలా కింద పడేలా చేయాలో ఆలోచించడంలేదు. ఇంతలో ఒక పండు ముసలాయన వచ్చి ఆ చెట్టు దగ్గర నిలుచున్నాడు. ఏంటి తాత పండు కోసం వచ్చావా...అని అడిగితే అవును బాబు అన్నాడు. హ హ ఉదయం నుండి ఇక్కడే ఉన్నా నాకే ఒకటి కూడా దొరకలేదు. ఇప్పుడే వచ్చావ్ నువు రాగానే ముసలాయన వచ్చాడు అని ఆ చెట్టు తన పండు తెంపి నీకు ఇస్తుందా ఏమిటి అని బిగ్గరగా నవ్వాడు.
ఇంతలో ఆ ముసలాయన ఒక రాయిని చేతిలోకి తీసుకోగా ఆ యువకుడు తను నవ్వినందుకు కొట్టడానికి తీసుకున్నాడేమో అనుకుని భయంతో వెనక్కు జరుగుతున్నాడు. కానీ ఆయన రాయితో పండ్లను కొట్టి కొన్ని ఆయన తీసుకుని, మిగిలినవి ఆ యువకుడికి ఇస్తూ ఒక మాట అన్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తే మన కోరుకున్నది ఎన్నటికీ పొందలేము. ఆలోచిస్తే అవకాశాన్ని మనమే కల్పించుకుని అనుకున్నది సాధించవచ్చు. ఇది జీవిత సత్యం తెలుసుకొని నడుచుకో అని వెళ్ళిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: