విజయం మీదే: స్వార్ధమే మీ శత్రువు... వదిలేయండి?

VAMSI
నేటి జీవన శైలిలో మనిషి వేష ధారణతో పాటు మనస్తత్వాలు కూడా మారిపోయాయి. ప్రేమ, జాలి, దయ, కరుణ అన్న భావాలు, విలువలు మనుషుల నిజ జీవితంలో కనుమరుగైపోయాయి. అందరిలోనూ స్వార్థం రాను రాను పెరుగుతోంది, దీని ప్రతిఫలం తెలిసి కూడా చాలా మంది జనాలు స్వార్థం వైపే పరుగులు తీస్తున్నారు. కానీ ఇదే స్వార్ధం మన జీవితంలోని ఎన్నో కీలక మలుపులకు కారణం కావచ్చు. ఆ మలుపులు ఇతరులను మాత్రమే కాదు మనల్ని కూడా దహించి వేస్తాయి సత్యాన్ని తెలుసుకోకపోతే పూర్తిగా మనల్ని దహించి వేస్తాయి. అందరూ ఇలాగే ఉన్నారు అని అనలేము కానీ కొందరు ఇలా ఉన్నా... నిస్వార్థం అనేది చాలా ప్రమాదకరమైనది.
అలాంటిది నేడు సమాజంలో స్వార్థం ఎక్కువైపోతోంది. నిస్వార్థంగా ఉన్న ఆ కొద్ది మందిని కూడా ఇలా ఉండటం తప్పు అన్నట్టుగా చూస్తున్నారు. దాంతో వారు కూడా సమాజంలో ఇలానే బ్రతకాలేమో అని అందరిలా మారిపోయేలా ఉన్నారు. మన పద్దతులు, అలవాట్లు అనేవి మనకే కాదు మనం జీవిస్తున్న ఈ సమాజంలోని ఇతరులకు కూడా ఇబ్బంది కలుగకుండా ఉండాలి. అలాంటి ఉన్నతి నిజమైన గెలుపు అనిపించుకుంది. స్వార్థం, నిస్వార్థం ఒక చిన్న అక్షరమే తేడా కానీ ఇది మన జీవితంలో చూపించే తేడా మాత్రం చాలా ఎక్కువే.
నిస్వార్థం అనే లక్షణం మనలో కొద్ది కొద్దిగా విషాన్ని నింపేస్తుంది. మనల్ని చూసి మన తదుపరి తరాల వారు కూడా స్వార్థంగా తయారవడానికి కారణం అవుతుంది. కనుకే స్వార్థాన్ని విడచి నిస్వార్థంగా బ్రతకడానికి మెల్లగా అలవాటు పడాలి. కాస్త కష్టమైనా మంచినే ఎప్పుడూ ఆహ్వానించాలి అదే స్వఛ్చమైన విజయం అవుతుంది. మరి ఈ ఆర్టికల్ చదివే మీలోనూ ఈ స్వార్థం వుంటే వెంటనే విడనాడి నిస్వార్థంగా జీవించండి. గెలుపు మీ కోసం వెతుక్కుంటూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: