విజయం మీదే: బంధాలను మరిచిపోయే ఈ రోజుల్లో ఇలా చేయండి?

VAMSI
ఎవ్వరికైనా విజయం అనేది అవసరం. కానీ విజయం పొందే క్రమంలో మనము ఎన్నో ముఖ్యమైన అంశాలను పోగొట్టుకుంటున్నాము. అందులో కొన్ని ఉన్నాయి. ఇతరులను నొప్పించకుండా ఉండటం కూడా ఒక రకంగా మన విజయమే అవుతుంది. అవును ఇది నిజమే ఫాస్ట్ జనరేషన్ లో బ్రతుకుతున్న చాలా మందికి ఇతరుల కోసం సమయాన్ని కేటాయించేంత టైం ఉండటం లేదు. కనీసం తమ వారితో కూడా పెద్దగా టైం స్పెండ్ చేయలేకపోతున్న రోజులివి. ఈ క్రమంలో ఒక రకంగా మనమే మన వారిని పరోక్షంగానో, ప్రత్యక్షంగానో బాధపెడుతున్నాము. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించినా వాస్తవానికి ఇది ఆలోచించి  మన పద్దతులను ఖచ్చితంగా మార్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం.
అవును ఇది నిజమే ఇది ఇలాగే కొనసాగితే బంధాలు, అనుబంధాలు , ఆప్యాయతలు, జాలి, దయ, కరుణ అన్న మాటలు కేవలం డిక్షనరీలో  మాత్రమే తప్ప మరెక్కడా చూడలేని, పొందలేని దుస్థితి ఏర్పడుతుంది. అందుకే పెద్దలు అంటుంటారు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని, మనవారి ప్రేమానురాగాలకు నోచుకోలేని మనం రేపటి మన కుటుంబ భవిష్యత్తు కోసం నేడు ఆరాటపడుతూ పరుగులు తీయడంలో అర్దం లేదు.  ఎప్పుడైతే మన కుటుంబ సభ్యులు అలాగే మన తోటి వారి మన్నలను పొంది వారి విజయాలలో భాగం అవుతూ అప్పుడే మనిషిగా నిజమైన విజయం అందుతుంది.
లేదంటే భవి భవిష్యత్తును చేతులారా మనమే నాశనం చేసిన వారము అవుతాము. కాబట్టి ఇప్పటి నుండైనా మనలో చాలా మందికి ఈ మార్పు అనేది అవసరం. ప్రస్తుతం అందరికీ బిజీ లైఫ్ లో ఇలా మన వారితో ఎక్కువ సమయం గడపలేక పోవచ్చు. వారి సుఖ దుఃఖాలు అన్నిటిలోనూ పాలు పంచుకోలేకపోవచ్చు. కానీ కనీసం కాస్త టైం ను అయినా వారి కోసం వెచ్చించాలి. అందరితో కలిసి మెలిసి వీలైనంత వరకు ఇతరులకు ఉపయోగపడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: