విజయం మీదే: మహిళలకు చిన్న వ్యాపార చిట్కాలు...

VAMSI
మనం ఆశించినది సాధించడమే విజయం, కోరుకున్న స్థాయిని పొందడమే విజయం. ఎంచుకున్న మార్గంలో అనుకున్న గమ్యాన్ని చేరుకోవడమే విజయం. చాలా మంది మహిళలకు వ్యాపారం చేసి ఆర్థికంగా ఎంతో కొంత కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడాలని ఉంటుంది. వారి కలను నెరవేర్చుకోవడమే వారి విజయంగా భావిస్తుంటారు. అయితే ఇలాంటి మహిళలకు ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం అయితే తక్కువ నష్ట భయం ఉంటుంది, ఎలా ఆ వ్యాపారాన్ని కొనసాగించాలి అని చాలా అనుమానాలే ఉంటాయి. ఇలాంటి ఆలోచనలతో కొందరు దైర్యం చేసి ముందడుగు వేయలేరు. అయితే ఇలాంటి వారు కొన్ని వ్యాపార చిట్కాలను కనుక తెలుసుకుంటే అవగాహన పెరిగి ముందడుగు వేయొచ్చు. కాగా అవేంటో ఒకసారి చూద్దాం.
* ప్రస్తుతం యు ట్యూబ్ కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అసలు యు ట్యూబ్ చూడని వారు అసలు ఉండరేమో అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి యు ట్యూబ్ లో వీడియోలు చేయడం ద్వారా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు నచ్చిన మీకు బాగా నైపుణ్యం ఉన కలను ఎంచుకుని అందుకు సంబంధించిన వీడియోలను తీసి యు ట్యూబ్ లో అప్లోడ్ చేయడం ఒక చక్కటి ఉపాయం.
* మినరల్ వాటర్ ప్లాంట్": ప్రస్తుత రోజుల్లో అందరూ మినరల్ వాటర్ కి బాగా అలవాటు పడుతున్నారు. దీనిని పెట్టుకోవడానికి సుమారు 50000 నుండి 70000 వరకు అవుతుంది. వాటర్ ప్లాంట్ ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి. మొదట రూ 5 లకు మొదలు పెట్టిన ఎక్కువ మంది కస్టమర్లకు అట్రాక్ట్ అవుతారు. ఆ తరవాత రూ 10 కు పెంచినా అందరూ వస్తారు ఇది ఇంట్లోనే ఉండి వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది మంచి ఆలోచన.
* కర్రీ పాయింట్స్: వ్యాపారం  కూడా ఇటువంటి వారికి ఒక చక్కటి ఉపాయం. బాగా క్వాలిటీ ఉన్న కర్రీస్ ను సప్లై చేయగలిగితే రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నా కస్టమర్ల సంఖ్య పెరిగి మీ వ్యాపారం లాభాలబాటలో సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: