విజయం మీదే: ప్రత్యర్థులకు తలొగ్గితే ఓటమిపాలైనట్టే?

VAMSI
మనం వెళ్లే దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. మనల్ని దాటేందుకు, ఓడించేందుకు పోటీదారులు, శత్రువులు ఎపుడు ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్లందరినీ అధిగమిస్తేనే విజయ శిఖరాలను చేరుకోగలము. మన శత్రువులను ఓడించడం అంటే విజయానికి చేరువవ్వడమే అవుతుంది. వ్యాపరమైనా, ఉద్యోగమైనా మనం ఎదగాలి అంటే ఇతరుల కన్నా మిన్నగా ప్రతిభను కనబరచాలి. ప్రత్యేకమైన పనితనాన్ని చూపించినప్పుడే మన గొప్పతనం అర్ధమయ్యి మనకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతి కూడా మన దరికి చేరుతుంది. కానీ శత్రువులను ఒడించడమంటే అంత సులువైన పనికాదు ప్రతి క్షణం దృష్టి కేంద్రీకరించాలి.
కాస్త ఏమరుపాటుగా ఉన్నా శత్రువు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండి ఒక కంట కనిపెడుతునే ముందుకు సాగేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. కాలమే కాదు శత్రువులు కూడా మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంటారు. సమస్యలను సృష్టిస్తుంటారు వాటిని తెలివిగా సమయ స్ఫూర్తితో ఎదుర్కొని వాటిని అధిగమిస్తేనే మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుని విజయాన్ని అందుకోగలరు. మనము ఏ రంగంలో ఉన్నాము అందులో ఒక స్థాయిలో ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రత్యర్ధులు సైతం మన ప్రణాళికలు చూసి వెనుకంజ వేసేలా ఉండాలి. ఎప్పుడైతే మనము భయపడుతామో అప్పుడే ఓటమిని అంగీకరించినట్లు అవుతుంది. శత్రువులను ఎదుర్కోవడానికి వారితో పోటీపడి వారిని ఓడించి విజయాన్ని సొంతం చేసుకోవడానికి మనం కొన్ని సూత్రాలను గుర్తుంచుకోవాలి.

శత్రువులను గెలవడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక అవసరం. ఎప్పటికప్పుడు శత్రువు కదలికలను బట్టి మన ప్రణాళికను మెరుగు పరుచుకోవాలి. మీరు ఇదే వైఖరిని జీవితాంతం కొనసాగించాలి. అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా లేదా అలసత్వం ప్రదర్శించినా శత్రువు చేతిలో దెబ్బ తినక తప్పదు. అందుకే ఎప్పటికప్పుడు మనము చేసే పొరపాట్లను సర్దుబాటు చేసుకుంటూ మన లక్ష్యం వైపు పరుగులు తీయాలి. కానీ మనల్ని ఇబ్బందులు పెట్టే వారి పట్ల ఒక చూపు వేసి పెట్టడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: