విజయం మీదే: ఈ ప్రపంచంలో నీ కన్నా తోపు ఎవ్వడూ లేడు..

VAMSI
ఈ అందమైన ప్రపంచంలో మనుషులు అంతా ఒకేలా ఉండరు అని తెలిసిందే. ఈ దేవుడి మనల్ని ఒక పాత్రల లాగా ఈ జగన్నాటకంలో ఆడిస్తున్నాడు. ఆయన ఎలా ఆడమంటే ఆలా ఆడడమే మనము చేయాల్సింది. అంతకు మించి ఏమీ లేదు. అందుకే మన జీవితాల్లో జరిగే ప్రతి చిన్న కష్టానికి బాధపడడం మంచి పద్ధతి కాదు. ఎప్పుడైతే ఇలా అనవసరమైన లేదా మీ సక్సెస్ కు అడ్డుపడే వాటి గురించి ఆలోచించడం మానేస్తారో అప్పుడే మీ జీవితం ఒక దారిన పడుతుంది. లేదంటే ఇలాగే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మీరు పైకి ఎదగకపోవడానికి ఇప్పుడు మనము చెప్పుకున్నది ఒక కారణం.
మరి కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తారు అంటే, తన పక్కన లేదా చుట్టుపక్కల ఉన్న వారిని చూసి వారితో తమను పోల్చుకుంటూ ఉంటారు. అయ్యో వారిలా మనము ఎందుకు లేము? వారిలాగా ఎందుకు సంపాదించడం లేదు? ఇలా ఎన్నో అంశాల్లో వారితో పోల్చుకుంటూ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటాము. ఇది ఎంత మాత్రం మంచిది కాదు అనే విషయాన్ని గ్రహించాలి. ఒకరిలా మీరు ఉండడం కాదు. నువ్వే నీకే ప్రత్యేకం అని తెలుసుకో. ఈ భూమి మీద నీకంటే తోపు ఎవడూ లేడు. నీకు ఏ పనులు చేస్తే సంతోషంగా ఉండగలవో ఆ పనులనే చేయాలి. అంతే కానీ పక్కవాడు చేస్తున్న పనులు చేస్తే నీ సంతోషాన్ని కోల్పోతావు.
 అందుకే అవతలి వారి గురించి ఆలోచించకండి. మీరేమీ చేస్తున్నారో తెలుసుకుని ఇంకా బెటర్ గా చేయడానికి ప్రయత్నించండి. ఒక లక్ష్యాన్ని అనుకుని దానిని సాధించే దిశగా నీ అలవాట్లను మార్చుకోవడానికి చూడండి. ఈ క్షణం నుండి నువ్వు నీలాగా ఉండు. నీలో ఇంకా ఏమైనా ప్రతిభకు పదును పెట్టుకో చాలు. విజయం అదే నీ వెంట పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: