విజయం మీదే: వ్యాపారం చేయాలి ఆశ ఉంటే సరిపోదు...

VAMSI
చాలా మందికి సొంతంగా వ్యాపారం చేయాలని ఉంటుంది. కొందరు ఉద్యోగాలు దొరకక వ్యాపారం చేయాలనుకుంటే, మరి కొందరు ఉద్యోగం వదిలి వ్యాపారం మొదలు పెడుతుంటారు. ఇంకొందరు వారసత్వంగా వస్తున్న వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా రకరకాలుగా వ్యాపారాలు చేస్తుంటారు. ఎవరైనా ఎక్కువగా వ్యాపారం వైపుకు ఎందుకు అంతగా ఆసక్తి చూపుతారంటే..!! ఇక్కడ ఒక్కసారిగా మన జీవితం ఎంతో అద్భుతంగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అందరూ వ్యాపారం చేయడానికి ఎందుకు ప్రయత్నించరు అంటే ఉద్యోగం అనేది సెక్యూర్ లైఫ్ ...పని చేస్తే అందుకు బదులుగా తగిన డబ్బు వస్తుంది. పెట్టుబడితో కానీ ఇక్కడ లాభ నష్టాలతో కానీ మనకి సంబంధం ఉండదు. కానీ వ్యాపారంలో అలా కాదు.
చాలా వరకు వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలి. లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉండాలి. లాభాలకు ఎంత ఆస్కారం ఉందో కష్టాలు వచ్చే అవకాశాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అందుకే వ్యాపారం అంటే ఇష్టం ఉన్న అందరూ ధైర్యం చేయలేరు. కానీ కొన్ని వ్యాపార సూత్రాలు కనుక జాగ్రత్తగా ఫాలో అయితే వ్యాపారంలో విజయాన్ని అందుకోవడం అంత కష్టమేమీ కాదు. ఒకవేళ మీరు తొలి సారి వ్యాపారాన్ని పెట్టబోతున్న వ్యక్తి అయితే మంచి ఫలితాలను పొందటానికి ఈ క్రింది అంశాలను తప్పక గుర్తుంచుకోండి మరియు పాటించండి.
* మీ పెట్టుబడి ఎంతో లెక్కలు వేసుకోండి. మీరు వ్యాపారం కోసం ఎంత వరకు పెట్టుబడిని పెట్టగలరు అన్నది మొదటి మెట్టు.
* మీరు ఆ వ్యాపారాన్ని ఏ ప్రదేశంలో ప్రారంభించాలి అనుకుంటున్నారో అక్కడ పరిసరాలకు తగ్గట్టుగా అక్కడ డిమాండ్ ఉన్న వ్యాపారాన్ని ఎంచుకోండి. అంటే ఉదాహరణకు ఏ సీజన్ అయినా బట్టల షాపుకి, లేదా కిరాణా షాపుకి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే మీరు ఉన్న ప్రాంతంలో అలాంటివి ఎక్కువగా ఉన్నట్లైతే వాటిని ఎంచుకోకపోవడమే ఉత్తమం. లేదా ఆల్రెడీ ఉన్న షాపుల కంటే క్వాలిటీ మెటీరియల్స్, అలాగే హోల్ సేల్ వంటి ఐడియాల ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకురావచ్చు. లేదా అక్కడి ప్రజలకు అవసరమైన అలాగే ఆ ప్రాంతంలో అందుబాటులో లేని వ్యాపారాన్ని ఎంచుకోండి.
 *మీరు మొదలు పెట్టలనుకున్న వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. అందులోని ఎత్తుపల్లాల గురించి అవగాహన పెంచుకోండి.
* ఉన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టేయకుండా కొంత డబ్బును పక్కన పెట్టుకోండి. అత్యవసర సమయాల్లో దాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా పెట్టుకోండి. ఇలా కొన్ని బేసిక్ అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితేనే ఆశించిన ఫలితాలను చూడగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: