విజయం మీదే: సంతోషంగా ఉండాలంటే ఇలాంటి వారిని దూరం పెట్టండి...

VAMSI
ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితంలో ఎన్నో పనులతో బిజీ అయిపోయి ఉంటారు. కొంత మందికి అయితే అసలు సంతోషమే ఉండదు. ఎప్పుడూ ఎదో ఒక పనితో జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడే అందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మనకు పనులు, కష్టాలు, బాధలు అనేవి ఎప్పుడూ ఉండేవే, మన జీవిత కాలం వాటితోనే ఉండాల్సి వస్తుంది. వాటి నుండి కొంచెం మనశ్శాంతి గా ఉండడానికి సంతోషం అనే ఆయుధం చాలా అవసరం అని గుర్తించండి. సంతోషం అనేది ఒక హక్కు. అయితే మీరు సంతోషంగా ఉండకుండా ఉండడానికి కొందరిని మీకు దూరంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.
* ఈ సమాజంలో కొందరు వారు ఇతరులను ఏదో ఒక విషయంలో బాధ  పెడుతూ ఉంటారు. ఇది వారికి ఒక అలవాటుగా మారిపోతుంది.  అయితే మీరు సంతోషంగా ఉండాలి కాబట్టి అటువంటి చెడ్డ వారికి దూరంగా ఉండడమే మంచిది.
 * అటువంటి వారిలో అహం ఉన్నవారు కూడా ఒకరు. వీరు ఎలా ఉంటారంటే వారి తప్పులను ఎప్పుడూ ఒప్పుకోరు. వారు చెప్పిందే కరెక్ట్ అనే భావనలో ఉంటారు. ఇలాంటి వారు మీ చుట్టు పక్కల ఉన్నా లేదా మీతో కలిసి ఉన్నా సంతోషంగా ఉండలేరు కాబట్టి వారిని దూరంగా పెట్టండి.  
మరి కొందరు...ఒక నిర్ణయం తీసుకున్నాక దానిపైన స్టాండ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ఏ పనిలోనూ ఇలాంటి వారు సక్సెస్ అవ్వలేరు. పైగా దానికి కారణంగా అదృష్టం లేదు అన్న పనికి రాని మాటలు చెబుతుంటారు. ఇలాంటి వారి డైర్యంగా ఉన్న వారిని సైతం పిరికి వారిలాగా  మార్చేస్తారు. కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది.
 * కొంత మంది అయితే ఇతరుల బాధలో ఆనందం వెతుక్కుంటూ ఉంటారు. మీతో ఇలాంటి వారునుంటే ఇక మీ లైఫ్ లో విజయం అనే మాట ఉండదు. కాబట్టి ఇలాంటి వారిని దూరం పెట్టండి.
* ఈ సమాజంలో ప్రస్తుతం ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి తెలిసిందే. కాబట్టి మహిళలపై గౌరవం లేని వారితో మీరు స్నేహం చేయకపోవడం మంచిది. వారు మిమ్మల్ని కూడా మార్చేయగలరు.
ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెప్పే వాటిని అస్సలు నమ్మకండి.  వాటిని దూరం పెట్టండి.
పైన తెలిపిన లక్షణాలు కలిగిన వారిని మీరు వీలైనంత దూరం పెడితే జీవితాంతం సంతోషంగా ఉండగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: