విజయం మీదే: ఇలా ఆలోచిస్తున్నారా... పప్పులో కాలేసినట్టే ?

VAMSI
"లోకులు కాకులు వంటి వారు" అని పెద్దలు అంటూ ఉండడం తరచూ మనము వింటూ ఉంటాము. చాలా మంది తమకు ఎంతో ఇష్టమైన పనులను చేయడానికి కూడా సంకోచిస్తుంటారు. అలా చేయడం వలన ఎదుటి వారు ఏమనుకుంటారు అని ఆగిపోతారు.  ఉదాహరణకు కొందరికి భోజనాన్ని కడుపు నిండా, సంతృప్తిగా తినాలని అనుకుంటారు. అందులోనూ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు అక్కడ వారికి నచ్చిన స్పెషల్ ఐటమ్స్ ను చూసి అస్సలు ఆగలేరు. కానీ చుట్టూ ఉన్న వారు  ఏమనుకుంటారో అన్న భావంతో కనీసం సంతృప్తిగా భోజనము చేయలేరు. మరి కొందరు తాము ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం పరుగులు తీస్తుంటారు , ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతుంటారు. అయితే ఈ మార్గ మధ్యలో ఎదురయ్యే కొన్ని సందర్భాల్లో ముందుకు అడుగు వేయడానికి సంకోచిస్తుంటారు. 

ఏ పని చేస్తే ఎవరు ఎలా ఫీల్ అవుతారు, అనుకుంటూ అడుగైనా వేయరు. ఇది ఇలాగే కొనసాగితే మీరు గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. ఆ విషయానికొస్తే ఇలాంటి ఆలోచన అస్సలు ముందుకు అదుగైనా వేయకుండా ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతారు. కానీ ఇలా చేయడం వలన మీ లక్ష్యాన్ని  చేరుకోవడం అస్సలు కుదరదు, అంతేకాదు మీకంటూ ఎటువంటి గుర్తింపు మిగలదు. మన ఆలోచనే మనకు లక్ష్యమై గమ్యం వైపు నడిపించాలి. కానీ ఇలా ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచిస్తూ మన నిర్ణయాలను మార్చుకోకూడదు. మనకు ఉన్న చిన్న చిన్న సంతోషాలను ఎవరి కోసమో మార్చుకోకూడదు.
మన చుట్టూ ఉన్న లోకులు తొందరగా నిందిస్తారు, అదే విధంగా తొందరగా అభినందిస్తారు కూడా వారు ఏమనుకుంటారో అని మీనమేషాలు లెక్క పెడుతూ పోతే నష్టం జరిగేది మనకే. కాబట్టి ఏ పని చేసినా అందులో మంచి ఉంటే చాలు ఎంత దూరమైన దాని కోసం వెళ్లొచ్చు. ఇక అయినా ఎటువంటి ఆలోచన కానీ మొహమాటం కానీ లేకుండా దైర్యంగా అడుగు ముందుకు వేయండి తప్పక విజయం సాధిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: