విజయం మీదే: లక్ష్య సాధనలో ఇదే మీకు ప్లస్ ?
ఎటువంటి పనిని లేదా లక్ష్యాన్ని ఎంచుకోవాలో మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఆ అంశం లోని లోతు, పల్లాలు తెలుసుకోగలిగితే...విజయాన్ని అందుకోవడం అంత కష్టమేమీ కాదు. మన బలాలు తెలుసుకోగలిగితే ఎదురయ్యే సవాళ్లను ఎంత వరకు అధిగమించగలరు అన్న అంచనా వేయగలం, తద్వారా మార్గం సులభమవుతుంది. ఏ వ్యక్తి అయితే తనలోని బలాలను, బలహీనతలను, దాగున్న సామర్ధ్యాలను తెలుసుకుని తనలోకి చూసుకో గలుగుతాడో, అలాంటి వారు సులభంగా సక్సెస్ అవుతారు. మనము ఇందులో బెస్ట్ అనేది తెలిస్తే ఏ విధమైన ప్రణాళికను చేసుకోవాలో తెలుస్తుంది.
ఇదే కాకుండా మనము ఇందులో లక్ష్యాన్ని చేధించే లేదా అందుకునే క్రమంలో అవసరమయిన ఇందులో బలహీనంగా ఉన్నామో దానిని పెంపొందించుకోవాలి. ఈ విధంగా బలాలు మరియు బలహీనతలను బ్యాలన్స్ చేసుకుంటూ లక్ష్యం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఈ విషయంలో కూడా తప్పులు చేస్తూ ఉంటారు. మన బలమేమిటో తెలుసుకోకపోతే అసలు టార్గెట్ ను ఎలా చేధించగలము. కాబట్టి ఎవ్వరైనా తొలిదశలోనే ఈ విషయం పట్ల సరైన అవగాహన పెంచుకోవాలి.