విజయం మీదే: ఈ స్వభావం ఏమాత్రం మంచిది కాదు ?

VAMSI
మనం మన నిత్య జీవితంలో ఇంటి చుట్టు పక్కల, ఉద్యోగం చేసే చోట ఇలా చాలా చోట్ల పలు సందర్భాల్లో ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. కొందరితో కలిసి కొంతకాలం ప్రయాణించాల్సి వస్తుంది. ఏ ఒక్కరు ఒకేలా ప్రవర్తించరు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. కొందరు కేవలం డబ్బులకు మాత్రమే విలువనిస్తూ ... ధనం ఉండే వారికి సకల మర్యాదలు ఇస్తూ పేద వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. వారిని తక్కువగా చూస్తుంటారు. స్నేహం చేయరు సరికదా... కనీసం అటువంటి వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. మనలో కూడా ఎంతో మంది అలాగే ప్రవర్తిస్తూ ఉండొచ్చు. అయితే ఇటువంటి ప్రవర్తన, జీవితంలో ఎటువంటి సంతోషాన్ని, మనశ్శాంతిని ఇవ్వదు. ఇటువంటి వారికి కాలం కూడా కలసి రాదు.
ఒక్కసారి వారి స్థానంలో మనం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించగలిగితే ఆ బాధ అనేది అర్థం అవుతుంది. చాలా మంది సమాజంలో ఇటువంటి పరిస్థితులను మానసికంగా ఎంతో కుంగిపోతున్నారు. ఒక మనిషిని మనం ప్రశంసించకపోయినా పర్వాలేదు. కానీ అసలు కించపరచకూడదు.  ఓడలు బండ్లు అవుతాయి...బండ్లు ఓడలు అవుతాయి అన్న సామెత వినే ఉంటారు. జీవితంలో పరిస్థితులు మారడానికి క్షణ కాలం పట్టదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఉన్నంతలో హాయిగా ఉండండి... తోటి మనుషులను గౌరవించండి.
ఎటువంటి తారతమ్యాలు చూపించకుండా అందరూ మనుషులమే అన్న విషయాన్ని గుర్తుంచుకుని మెలిగితే ఎటువంటి సమస్య ఉండదు. ఎవరినీ ఎప్పుడు బాధించ కూడదు. ఈరోజు నువ్వు శక్తివంతుడై ఉండవచ్చు. కానీ కాలం నీ కంటే కూడా శక్తివంతమైనది అని తెలుసుకో. ఒక చెట్టు నుండి లక్ష అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక అగ్గిపుల్ల చాలు.. కాబట్టి మంచితనంతో ఉండాలి, అందరితో మంచిగా మెలగాలి. నలుగురు స్నేహాన్ని సంపాదించుకో... రేపు ఆ నలుగురు నీకు కష్టసుఖాల్లో తోడుగా నిలబడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: