విజయం మీదే: అనవసరమైన ఆలోచనలు జీవితానికే ప్రమాదం...

VAMSI
మనిషి మేధస్సు అనంతం అపారం. సాదన చేయాలే కానీ, ఏదైనా సాధించగలం అన్నది అనుభవజ్ఞులు చెబుతున్న మాట. అయితే అవసరానికి మించిన ఆలోచనలు, ఆదాయానికి మించిన కోరికలు మనిషిని కష్టాల ఊబిలోకి లాగేస్తాయి. కన్నీళ్ల కడలిలో ముంచేస్తాయి. అందుకే మన ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం ఖచ్చితంగా తెలిసి ఉండాలి అంటారు పెద్దలు. అలా కాకుండా ఆలోచనలు పెరుగుతూ పోతే కోరికలు కూడా వాటితో పాటుగా నిచ్చెనలు వేస్తాయి. అప్పుడు వాటిని కంట్రోల్ చేయడం కష్టమే అవుతుంది.  మనిషికి ఆలోచన అనేది అవసరమే. ఆ ఆలోచనే నాటి ఆది మానవుడిని నేడు ఆధునిక యుగంలో ఎన్నో సౌకర్యాల మద్య అభివృద్ధి మధ్య నిలబెట్టింది. అయితే శృతి మించిన ఆలోచనలు మనకే చేటును కలిగిస్తాయి. అందుకే మన ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. 

ఆలోచనలు అనేవి మన మనసుపై ఆధారపడి ఉంటాయి. మన మనసును అదుపు చేయగలిగితే మన ఆలోచనలను కూడా నియంత్రించవచ్చు. మనము ఎంత ఆలోచనలను నియంత్రించుకుంటూ ముందుకు సాగుతామో అంతగా మన జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. లేదంటే ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతే అది మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా అనవసరమైన ఆలోచనలు మన ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తాయి. మన శరీరంపై ప్రబావం చూపి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి, అవి పెను ముప్పును తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే మన మనసును మనమే కంట్రోల్ చేయాలి. మంచి ఆలోచనల వైపు మన మనసును మరలించాలి. 

చెడు ఆలోచనలను మొదట్లో తుంచివేయాలి. ప్రతి ఆలోచన మన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది తద్వారా సమాజం మనల్ని అందుకు తగ్గట్టగానే గుర్తింపును ఇస్తుంది. కాబట్టి మన ప్రతి చిన్న ఆలోచన మంచిదై ఉండాలి మనకి  మేలు చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇతరులకు మాత్రం చెడు చేయకూడదు. కావున మన ఆలోచన విధానం ఎప్పుడూ సరైనదై ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: