DELULU Teaser: ‘డెలులు’ టీజర్ విడుదల.. ఫన్ ఎలిమెంట్స్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న యువతరం చిత్రం!
యువతరం నటీనటులతో తెరకెక్కుతున్న ‘డెలులు’ మూవీ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఒక నిమిషం 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్.. ‘బ్రేకప్ దేవా’ అనే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, పాత్రల మధ్య జరిగే సరదా సంభాషణలు టీజర్‌కు మంచి ఫన్ టచ్‌ను తీసుకొచ్చాయి. టీజర్‌లోని పలు డైలాగ్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఆడదానివైన నువ్వు.. చీప్‌గా ఓ మగాడి కోసం మారతావా అంటావా.. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు’, ‘నువేమైనా ఫాదర్ ఆఫ్ ఇండియానా?’, ‘నువ్వు అత్తాపూర్‌కు రారా.. నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా’, ‘కుక్కకు పుట్టినవా నువ్వు’ వంటి డైలాగ్స్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఈ డైలాగ్స్, కామెడీ సన్నివేశాలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ముఖ్యంగా ఓ ఇంటి నేపథ్యంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు, పాత్రల మధ్య కెమిస్ట్రీ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కామెడీతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలకు కూడా సినిమాలో ప్రాధాన్యత ఇచ్చినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తంగా టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
సాంకేతికంగా కూడా ‘డెలులు’కు మంచి బృందం పనిచేస్తోంది. జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. హరికృష్ణ కురపాటి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆది చెబ్రోలు సంగీతం అందిస్తున్నారు. టీజర్‌లో సంగీతం కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువతను టార్గెట్ చేసే ఫన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో ‘డెలులు’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. టీజర్‌కు వస్తున్న స్పందనతో ‘డెలులు’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. విభిన్నమైన టైటిల్, కామెడీతో కూడిన కథనం, ఫన్ ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్‌గా మారే అవకాశముంది. మరి థియేటర్లలో ‘డెలులు’ ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తుందో చూడాలి.