విజయం మీదే: ఈ సందర్భంలో అలాంటి తప్పు చేయకండి ?

VAMSI
బంధువులతో అయినా బయట వారితో అయినా, పాఠశాలలో అయినా పని చేసే చోట అయినా కొన్ని సార్లు ఏదో ఒక విషయం మీద చర్చలో పాల్గొనాల్సిన సందర్భం వస్తుంది. అలాంటప్పుడు ఎదుటివారు చెప్పే కొన్ని అంశాలు మనకు నచ్చకపోవచ్చు లేదా అవి అంత కరెక్ట్ అయి ఉండక పోవచ్చు. అయినా కూడా మన అభిప్రాయాన్ని చెప్పడం తప్పనిసరి కాకపోయినా చెప్పటం మంచిది. కానీ చెప్పే విధానం మాత్రం ఖచ్చితంగా అందరికీ సానుకూలంగా ఉండాలి, సామరస్యంగా అనిపించాలి. ఎదుటి వారు చెప్పే విషయం మనకు నచ్చనప్పుడు వారికి ఆ విషయాన్ని నిదానంగా తెలియజేయాలి. అంతే తప్ప వారి మనసు నొచ్చుకునేలా చెప్పరాదు. అలా చెప్పడం ద్వారా వారి ఇగో దెబ్బ తిని మనపై ద్వేషాన్ని పెంచుకునే అవకాశం ఉంది. తద్వారా మనస్పర్ధలు పెరుగుతాయి.
అందుకే ఎవరితో అయినా మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి, ఆ తర్వాతే పెదవి విప్పండి. ఎదుటి వారు చెప్పేది సరికాదని అనిపిస్తే దాన్ని సానుకూలంగానే ఖండించాలి. మృదువైన పదజాలంతో సున్నితంగానే తిరస్కరిస్తూ మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు, ఉండాలని కూడా లేదు. అలాంటప్పుడు కొన్ని సార్లు ఎదుటి వారికి వ్యతిరేకంగా మన భావలను, అభిప్రాయాలను తెలియజేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చాలా నిదానంగా చెప్పడానికి ప్రయత్నించాలి. విమర్శించినట్లు కాకుండా మర్యాద పూర్వకంగా సౌమ్యమైన మాటలతో ఖండించాలి.
అలాగే మనకంటే పెద్ద హోదాలో ఉన్న వారికి మన బాస్ కి కానీ, లేదా పెద్ద వారి అభిప్రాయాలకు కానీ ఖండించాల్సినప్పుడు చాలా మంది అది ఎటు పోయి ఎటు వస్తుందేమోనని మౌనంగా ఉండి పోతారు. కానీ ఇలా చేయడం అంత కరెక్ట్ కాదు ఇటువంటి సమయంలో కూడా వారిని నొప్పించకుండా భిన్నాభిప్రియాన్ని వారు మెచ్చేలా వ్యక్తపరచడం
అనేది మీ చేతుల్లోనే మీ మాటల్లోనే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: