విజయం మీదే: మనిషి గెలుపుకు మూల సూత్రాలివే ?

VAMSI
జీవితమనే ప్రయాణంలో అన్ని వేళలా మనకు అనుకూలంగా ఉండవు. అలాగని శాశ్వతం కాదు. జీవితంలో సుఖసంతోషాలు, ఎత్తుపల్లాలు అనేవి సర్వసాధారణం. ఇది ఏమైనా అన్నిటినీ మనస్పూర్తిగా పాజిటివ్ గా తీసుకోగలిగితే ఎటువంటి ఇబ్బందీ లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా కాకుండా చిన్న విషయాలకు, చిక్కులకు కూడా పరిమితికి మించి ఆలోచిస్తూ బాధపడుతూ కుంగిపోతే సమస్య మరింత జటిలంగా మారుతుంది. సంతోషం అనేది పూర్తిగా కరువై దుఃఖాల సంద్రంలో కొట్టుకు పోతుంది. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సిరిసంపదలు రెండే రెండు అని అంటూంటారు పెద్దవాళ్ళు. అవి ఒకటి మనశ్శాంతి మరొకటి సంతృప్తి.
ఈ రెండింటినీ సంపాదించడానికి, మన జీవితంలోకి ఆహ్వానించడానికి కావలిసింది ఓర్పు , ప్రేమ మరియు సహనం. ఇవి ఉంటే మనం జీవితాన్నే జయించవచ్చు. ఆనందంగా మన జీవితాన్ని గడిపేయవచ్చు. ఎటువంటి వారికైనా కష్టాలు తప్పవు. జీవితంలో భాగంగా వస్తుంటాయి అలాగే పోతుంటాయి. అయితే అటువంటి సమయంలో మనం కుంగిపోకుండా కాస్త ఓర్పుగా ఉండగలిగితే చాలు. అదే మనకు ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి కొండంత దైర్యాన్ని ఇస్తుంది. ఇలా కాకుండా వాటికి భయపడి బాధపడి అక్కడే ఆగిపోతే చీకటి వెనకున్న వెలుగును చూడలేము. మనసుకు మనశ్శాంతి కరువై మానసికంగా కుంగిపోయి మనిషి అక్కడే ఆగిపోతాడు.
అది మీ ఓటమే అవుతుంది. ఎపుడైతే ఆ సమస్యలను దాటి అడుగు వేయగలమో అది మన గెలుపే అవుతుంది. మన ఆలోచనలే మనం మనశ్శాంతిగా ఉండగలమా లేదా అన్న విషయాన్ని నిర్ణయిస్తాయి. వీలైనంత వరకు అందరితోనూ ప్రేమగా ఉండటానికే ప్రయత్నించండి. అపుడు వారంతా మీ మంచే కోరుకుంటారు, మీకు అండ దండగా నిలుస్తారు. మీరు చూపించే ప్రేమ, సహనం, స్నేహం తిరిగి మీకు మంచే చేస్తాయి. అవన్నీ కలిసి మీ గెలుపుకు బాటను వేస్తాయి.  కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ లక్షణాలను వదులుకోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: