విజయం మీదే: పొరపాట్లే మీ అభివృద్ధికి మెట్లు... ?

VAMSI
మనిషి అన్నాక లైఫ్ లో అభివృద్ధిలోకి వచ్చిన తరువాత సుఖానికి అలవాటుపడిపోతారు. ఇది సర్వసాధారణంగా జరిగే ఒక క్రియ. అయితే లైఫ్ లో కష్టం వచ్చినప్పుడు దానిని తప్పించుకోవడం మాత్రం మంచి పద్ధతి అనిపించుకోదు. అయితే ఇలా దుఃఖం కలగడానికి కారణం మీరు తెలిసో లేదా తెలియకో చేసే కొన్ని తప్పులే అని చాలా సర్వేలు చెబుతున్నాయి. కానీ ఆ తప్పులు ఎందుకు జరిగాయి, వాటిలో మన పాత్ర ఎంత ఉంది అని కొంచెం ఆలోచిస్తే మళ్ళీ ఆలాంటి తప్పులు జీవితంలో జరగకుండా జాగ్రత్త పడవచ్చు అని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ మీరు అన్ని సమయాలలో తప్పులు జరగకుండా నియంత్రించలేరని గుర్తుంచుకోండి. అలాగని మనిషి అన్నవారెవ్వరూ తప్పులు చేయకుండా ఉండలేరన్నది అంతే వాస్తవం.
ఎప్పుడు ఏమి జరుగుంతుందో ఎవ్వరూ ఊహించడానికి కుదరదు. ఇప్పుడు ఏమి జరుగుతుందో అదే ముఖ్యం. ఈ క్షణం మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా అన్నది అలోచించి స్టెప్స్ తీసుకుంటే ఎక్కువగా తప్పులు జరగకుండా చూడొచ్చు. కానీ జరిగిన తర్వాత దానికి నువ్వు ఎలా ప్రవర్తిస్తావు ? ఏ విధంగా దాని నుండి బయటపడతావన్నదే ముఖ్యం. కొన్ని సమయాల్లో మనము నమ్మేది కూడా కరెక్ట్ కాకపోవచ్చు. అంతెందుకు మీ మైండ్ చెప్పేది కొన్ని సార్లు సరిగ్గా ఉండకపోవచ్చు. అందుకే ఎప్పుడూ మెలకువగా ఉండాలి. ఏమి జరుగుతుందో గమనించాలి. వీలైనంతవరకు తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకు మించి ఎవ్వరూ ఏమి చేయలేరు.
అయితే పదే పదే ఒకే తప్పు చేస్తున్నారంటే, మీకు జీవితంపై సరైన అవగాహన లేదని అర్ధం. భవిష్యత్తులో ఈ విధమైన ఆలోచనా విధానం ఉన్నప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు చేయండి. మీకున్న నెగటివ్ ఆలోచనలని మీ శక్తిగా మార్చుకోండి. తప్పుల నుండి నేర్చుకోవడానికి యత్నించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: